Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : చీఫ్ లు చీప్ గా చేస్తున్నారెందుకు..?

టాస్కులు పెరుగుతున్నా కొద్ది హౌస్ లో హడావిడి గొడవలు ఎక్కువ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   13 Sep 2024 7:27 AM GMT
బిగ్ బాస్ 8 : చీఫ్ లు చీప్ గా చేస్తున్నారెందుకు..?
X

బిగ్ బాస్ సీజన్ 8 లో మొదటి వారం నుంచి ముగ్గురు చీఫ్ లను ఎంపిక చేసి వారిని 3 క్లాన్స్ గా విభజించి ఆ 3 క్లాన్స్ లో కంటెస్టెంట్స్ ని ఉంచి ఆట ఆడిస్తున్న విషయం తెలిసిందే. ఐతే అతి పెద్ద క్లాన్ గా చీఫ్ యష్మి నిలిచింది. ఆమె క్లాన్ లో ప్రేరణ, అభయ్, పృధ్వి, శేఖర్ బాషా, సోనియా ఉన్నారు. నైనిక చీఫ్ గా ఉన్న అంతులేని వీరులు క్లాన్ లో నైనికతో పాటు విష్ణు ప్రియ, సీత, నబీల్, ఆదిత్య ఓం ఉన్నారు. ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్న క్లాన్ గా కెరటం లో నిఖిల్ చీఫ్ గా ఉండగా మణికంఠ మాత్రమే తోడుగా ఉన్నాడు.

టాస్కులు పెరుగుతున్నా కొద్ది హౌస్ లో హడావిడి గొడవలు ఎక్కువ అవుతున్నాయి. గురువారం జరిగిన సాక్స్ టాస్క్ లో చీఫ్ యష్మి వేరే క్లాన్ సభ్యులతో గొడవ పడింది. తన క్లాన్ సభ్యురాలైన ప్రేరణ ఆ టాస్క్ సంచాలక్ గా ఉన్నా సరే యష్మి విష్ణు ప్రియ, నబీల్ అవుట్ అయిన విషయంలో కాస్త అతి చేసింది. అవతల క్లాన్ వారు అవుట్ అయిన ప్రతిసారి తను డాన్స్ చేస్తూ.. చప్పట్లు కొడుతూ చిత్ర విచిత్రంగా ప్రవర్తించింది. అఫ్కోర్స్ ఇది తన ఆటలో భాగమే అయినా సరే అది బయటకు ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అన్నది ఆమె పూర్తిగా మర్చిపోయినట్టు ఉంది.

అతి పెద్ద క్లాన్ చీఫ్ గా యష్మి చూపిస్తున్న కొద్దిపాటి లెవల్ ని చూసి మిగతా క్లాన్ సభ్యులు అసంతృప్తిగా ఉన్నారు. ఇక నిన్న జరిగిన టాస్క్ వల్ల అందరికీ ఆమె టార్గెట్ అయినట్టుగా అనిపించింది. కచ్చితంగా నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లో యష్మిని కంటెస్టెంట్స్ ఈ విషయంపై ఆమెను నామినేట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఐతే యష్మి ఇదంతా తన క్లాన్ కోసమే చేసిందని కొందరు గుర్తిస్తున్నా బయటకు మాత్రం ఆమె సైకోయిజమని.. తను మాత్రమే గెలవాలని ఆమె అనుకుంటుందని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

అంతేకాదు యష్మి ఇప్పటివరకు ఒక్క టాస్క్ కూడా ఆడి గెలిచింది లేదు. బుధవారం స్పెల్లింగ్ టాస్క్ లో ఆడిన ఆమె అది కూడా ఓడిపోయింది. మరి తన విషయంలో టాస్క్ లు కాస్త ఇబ్బంది పెట్టేవి అయినా సరే అవతల వారు ఓడిపోతే మాత్రం దాన్ని ఆమె బాగా ఎంజాయ్ చేస్తుంది. అందుకే సోషల్ మీడియాలో బిగ్ బాస్ 8 చీఫ్ లు చాలా చీప్ గా ప్రవర్తిస్తున్నారని కామెంట్స్ పెడుతున్నారు. ఇదే నెగిటివిటీ కొనసాగితే యష్మి హౌస్ నుంచి త్వరగానే బయటకు వచ్చేస్తుందని చెప్పొచ్చు.