Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8.. ఫైనల్ లిస్ట్ ఇదేనా..?

7 సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 ని త్వరలో మొదలు చేస్తుందని తెలిసిందే

By:  Tupaki Desk   |   27 Aug 2024 6:55 AM GMT
బిగ్ బాస్ 8.. ఫైనల్ లిస్ట్ ఇదేనా..?
X

7 సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 ని త్వరలో మొదలు చేస్తుందని తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి బిగ్ బాస్ 8 స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే హోస్ట్ నాగార్జున ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమోలతో బిగ్ బాస్ ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. ఐతే సీజన్ మొదలవుతుంది అనగానే ఈ సీజన్ కంటెస్టెంట్స్ గురించి రకరకాల వార్తలు రావడం కామనే. ఇప్పుడు కూడా బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరే అంటూ ఒక లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

బిగ్ బాస్ సీజన్ 8 లో ఎక్కువగా బుల్లితెర, సోషల్ మీడియా సెలబ్రిటీస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక సోషల్ మీడియాలో లీక్ అయిన లిస్ట్ చూస్తే ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో రీతు చౌదరి కన్ఫర్మ్ అంటున్నారు. జబర్దస్త్ లో కొన్నాళ్లు అలరించిన రీతు ఆ తర్వాత జబర్దస్త్ కు దూరమైంది. స్టార్ మా షోస్ లో కనిపిస్తూ అలరిస్తున్న రీతు ఈసారి కన్ఫర్మ్ కంటెస్టెంట్ అని అంటున్నారు. ఆమెతో పాటు యాంకర్ విష్ణు ప్రియ కూడా ఈ సీజన్ కంటెస్టెంట్ గా వస్తున్నట్టు తెలుస్తుంది.

జబర్దస్త్ లో మొన్నటిదాకా యాంకర్ గా చేసిన సౌమ్యా కూడా ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా రాబోతున్నట్టు టాక్. వీరితో పాటు యాంకర్ సీత, న్యూస్ రీడర్ కళ్యాణి, ఒకప్పటి హీరో ఆదిత్య ఓం, సింగర్ సాకేత్, జబర్దస్త్ కమెడియన్ పవిత్ర, యాక్టర్స్ రవితేజ, నిఖిల్, పరమేష్, అభయ్, ఇంద్ర నీల్ కూడా ఉన్నారు. వీరితో పాటు సీరియల్ యాక్టర్ తేజశ్విని గౌడ కూడా ఈ సీజన్ కంటెస్టెంట్ గా వస్తున్నారని టాక్.

బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని బుల్లితెర ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఐతే సర్క్యులేట్ అవుతున్న లిస్ట్ లో ఎవరు కన్ఫర్మ్ కంటెస్టెంట్ ఎవరు చివరి నిమిషంలో ఆగిపోతారు అన్నది షో మొదలైనప్పుడు తెలుస్తుంది. సెప్టెంబర్ 1 ఆదివారం గ్రాండ్ గా బిగ్ బాస్ సీజన్ 8 మొదలవుతుంది. ఈ సీజన్ ని అన్ని సీజన్ల కన్నా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారట బిగ్ బాస్ టీం. కచ్చితంగా బిగ్ బాస్ ఫ్యాన్స్ కు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందించేలా కొత్త కొత్త టాస్కులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.