Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : పట్టు వస్త్రాల్లో బిబి బ్యూటీ!

బిగ్ బాస్ నుంచి కొన్ని వారాలకే బయటకు వచ్చినా కూడా హీరోయిన్‌ రేంజ్ అందం దివిది అంటూ చాలామంది కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.

By:  Tupaki Desk   |   24 Nov 2023 6:59 AM GMT
ఫోటోటాక్ : పట్టు వస్త్రాల్లో బిబి బ్యూటీ!
X

తెలుగు బిగ్‌ బాస్ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. అందులో దివి ఒకరు అనడంలో సందేహం లేదు. బిగ్ బాస్ కి ముందు వరకు ఆమె గురించి ప్రత్యేకంగా ఎవరికీ తెలియదు. కానీ ఎప్పుడైతే బిగ్‌ బాస్ లో సందడి చేసిందో అప్పటి నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ మొదలు అయింది.


బిగ్ బాస్ నుంచి కొన్ని వారాలకే బయటకు వచ్చినా కూడా హీరోయిన్‌ రేంజ్ అందం దివిది అంటూ చాలామంది కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. అంతే కాకుండా ఆమె సోషల్ మీడియా లో హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోత చేస్తూ కుర్రకారును కవ్విస్తూ వస్తుంది.


తాజాగా మరోసారి పట్టు చీర కట్టు లో ఈ బిగ్ బాస్ బ్యూటీ అందాలతో కనువిందు చేసింది. నడుము అందం చూపిస్తూ, సాంప్రదాయబద్దమైన అందాలను చూపించిన దివి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ రేంజ్ లో అందంగా ఉన్నా కూడా పాపం దివికి హీరోయిన్‌ గా అవకాశాలు రావడం లేదని కామెంట్స్ వస్తున్నాయి.

పట్టు డ్రెస్ లో నడుము అందాన్ని చూపిస్తూ కవ్విస్తున్న ముద్దుగుమ్మ దివి తెలుగు అమ్మాయి అవ్వడం వల్లే సినిమాల్లో ఎక్కువ ఆఫర్లు రావడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆమె అందాల ఆరబోతతో సోషల్‌ మీడియాలో స్టార్‌ హీరోయిన్‌ అయింది. కనుక హీరోయిన్‌ గా నటించాల్సిన అవసరం లేదు అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.