Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 సర్ ప్రైజ్ ఎంట్రీస్ గట్టిగానే ?

కాంట్రవర్సీలలో భాగం అయిన వారిని కూడా సడెన్ గా హౌస్ లోకి తీసుకొని వస్తారు.

By:  Tupaki Desk   |   31 July 2024 11:49 AM GMT
బిగ్ బాస్ 8 సర్ ప్రైజ్ ఎంట్రీస్ గట్టిగానే ?
X

తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పటి వరకు ఏడు సీజన్స్ కంప్లీట్ చేసుకొని 8వ సీజన్ ని రెడీ అవుతోంది. ఇప్పటికే నిర్వాహకులు కంటిస్టెంట్ ల వేట మొదలుపెట్టారు. చాలా మంది సెలబ్రెటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్స్ తో పాటు వివిధ రంగాలలో రానిస్తున్న వారిని కూడా ఎంపిక చేసే ప్రయత్నం జరుగుతోంది. అయితే షో ప్రారంభం అవడానికి రెండు, మూడు రోజుల ముందు వరకు కంటిస్టెంట్ ల విషయంలో బిగ్ బాస్ టీమ్ కసరత్తులు చేస్తూనే ఉంటుంది.

కాంట్రవర్సీలలో భాగం అయిన వారిని కూడా సడెన్ గా హౌస్ లోకి తీసుకొని వస్తారు. ఇప్పటి వరకు జరిగిన ఏడు సీజన్స్ లలో అత్యధిక ఆదరణ పొందింది సీజన్ 7 అని చూపొచ్చు. ఇందులో కామన్ మెన్ గా, సోషల్ మీడియా ఫేమ్ తో వచ్చిన రైతుబిడ్డ ప్రశాంత్ విన్నర్ అయ్యారు. బిగ్ బాస్ హిస్టరీ లో ఫస్ట్ టైమ్ ఒక కామన్ మెన్ ని టైటిల్ వరించింది. ఈ సారి సీజన్ 7 కంటే ఎక్కువ హైప్ ఉండేలా కంటిస్టెంట్ ల ఎంపిక జరుగుతోందనే మాట వినిపిస్తోంది.

సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారు ఎక్కువగా ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్నారంట. ఈ సారి బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొనబోయే కంటిస్టెంట్ ల జాబితాలో కిర్రాక్ ఆర్పీ, అమృతా ప్రణయ్, నిఖిల్(యాంకర్), కుమారీ ఆంటీ, బర్రెలక్క, అనీల్ గీలా(యూట్యూబర్), బుల్లెట్ భాస్కర్, బమ్ చిక్ బబ్లూ, వంశీ లతో పాటు రీతూ చౌదరి, సోనియా సింగ్, కుషితా కల్లపు, సుప్రిత, అంజలి పవన్, వింధ్య విశాక, వర్షిణి, నయని పావని, విష్ణు ప్రియ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ఒకప్పటి హీరో అబ్బాస్ ని కూడా నిర్వాహకులు సంప్రదిస్తున్నారంట.

అలాగే ఇప్పుడు మరికొందరి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. హీరో రాజ్ తరుణ్, కమెడియన్ ప్రభాస్ శ్రీను, యాక్టర్ గాయత్రి గుప్తా లని కూడా బిగ్ బాస్ హౌస్ లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సీజన్ 8కి సంబంధించి హౌస్ సెట్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మిస్తున్నారు. ఈ సెట్ కంప్లీట్ అయ్యేసరికి కంటిస్టెంట్ ల ఫైనల్ లిస్ట్ కూడా రెడీ అయిపోతుందంట. త్వరలో సీజన్ 8 ప్రారంభ తేదీని ప్రకటించే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.