Begin typing your search above and press return to search.

బిగ్ బాస్.. శృతిమించిన రొమాన్స్!

అయితే బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటిస్టెంట్ లు ఇచ్చే కంటెంట్ కొన్ని సార్లు వివాదాస్పదం అవుతూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   16 July 2024 2:30 PM GMT
బిగ్ బాస్.. శృతిమించిన రొమాన్స్!
X

బిగ్ బాస్ రియాలిటీ షో ఇండియాలో ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. హిందీతో పాటు చాలా భాషలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఏడాదికి ఒకసారి ప్రసారం అవుతూ ఉంటుంది. వివిధ రంగాలలో సెలబ్రెటీలుగా ఉన్నవారిని కంటిస్టెంట్ లుగా ఎంపిక చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తూ ఉంటారు. ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఫేమస్ అయిన సెలబ్రెటీలు చాలా మంది ఉన్నారు. అయితే బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటిస్టెంట్ లు ఇచ్చే కంటెంట్ కొన్ని సార్లు వివాదాస్పదం అవుతూ ఉంటుంది.

కొంతమంది ఈ షోని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటారు. అయితే ప్రేక్షకాదరణ వచ్చే వరకు ఎవరూ కూడా ఈ షోకి ఆపలేరు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కాబోతోంది. హిందీ బిగ్ బాస్ టెలివిజన్ రియాలిటీ షోకి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఉన్నారు. అలాగే ఓటీటీలో కూడా బిగ్ బాస్ ని సపరేట్ గా నడుపుతున్నారు. హిందీ ఓటీటీ బిగ్ బాస్ సీజన్ 3 ఇప్పటికే స్టార్ట్ అయ్యి ప్రసారం అవుతోంది. అనిల్ కపూర్ ఈ ఓటీటీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ షోలో యుట్యూబ్ ఇన్ ఫ్ల్యూయెన్సర్ అర్మాన్ మాలిక్ తన ఇద్దరు భార్యలతో కలిసి పాల్గొన్నాడు. అయితే తాజాగా ప్రసారమయ్యే ఎపిసోడ్ లో అర్మాన్ మాలిక్ తన రెండో భార్య కృత్తికా మాలిక్ తో శృతి మించి రొమాన్స్ చేస్తోన్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిని ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ రియాలిటీ షో ఇంతకు మించి అశ్లీలత ఉండదనుకున్న ప్రతిసారి వాటిని బ్రేక్ చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఇంత దారుణంగా పబ్లిక్ చూసే రియాలిటీ షోలో లైవ్ గా రొమాన్స్ చేసుకుంటున్న విజువల్స్ ఎలా ప్రసారం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. వ్యూవర్ షిప్ కోసం ఇంతగా దిగజారిపోవాలా అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ ప్రేమికులలో కొంతమంది ఆ వీడియోపై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. భార్యాభర్తలుగా ఉన్న వారు అలా ఒకే బెడ్ మీద వాళ్ళకి నచ్చినట్లు ఉండటంలో తప్పులేదని అంటున్నారు.

గతంలో ఓ హీరోయిన్ టాస్క్ లో భాగంగా మరొక కంటిస్టెంట్ కు డైరెక్ట్ గా లిప్ కిస్ ఇచ్చింది. కంటిన్యూగా ఇద్దరు అందరి ముందు ముద్దులు పెట్టుకున్నారు. ఆ ఇష్యూ పెద్ద సెన్సేషన్ గా మారింది. తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే అంతకంటే దారుణంగా నెక్స్ట్ లెవల్ లో ఓటీటీ బిగ్ బాస్ షోలో జరగడంపై బిటౌన్ లో తీవ్ర చర్చ నడుస్తోంది.