బిగ్ బాస్ రతిక బ్రేకప్ ఎవరితో..?
అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ తో రతిక లవ్ స్టోరీపై సోషల్ మీడియాలో ఇప్పటికే వార్తలు జోరందుకున్నాయి.
By: Tupaki Desk | 8 Sep 2023 7:52 AM GMTబిగ్ బాస్ సీజన్ 7 లో 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చారు. ఈసారి అందరు దాదాపుగా తెలిసిన వారిలానే ఉండగా కొందరు మాత్రం కాస్త కొత్తగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ ఫ్యూయెన్సర్ రతిక, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, మోడల్ ప్రిన్స్ యావర్, హీరో కమ్ డాక్టర్ గౌతం కృష్ణ తప్ప మిగతా వారంతా కూడా ఆడియన్స్ కు పరిచయం ఉన్న వారే. హౌస్ లో ఉన్న 14 మంది కంటెస్టెంట్స్ లో రతిక రోజ్ కాస్త సందడి ఎక్కువ చేస్తుంది. పల్లవి ప్రశాంత్ తో ఆమె క్లోజ్ అవుతుంది.
రతిక హౌస్ లోకి వెళ్తూనే తన లవ్ బ్రేకప్ గురించి నాగార్జునతో ప్రస్తావించింది. దానికి కారణం నాగార్జునే అన్నట్టుగా చెప్పింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో రతిక గురించి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.
ఇక బయట పడ్డ వాస్తవం ఏంటంటే ఆల్రెడీ బిగ్ బాస్ విన్నర్ అయిన ఒక కంటెస్టెంట్ తో రతిక లవ్ ట్రాక్ నడిపించింది. అతనితో ప్రేమాయణం నడిపించిన రతిక సడెన్ గా అతను బిగ్ బాస్ కి వెళ్ళాక ఒంటరిగా ఫీల్ అయ్యింది.
అంతేకాదు అతను హౌస్ లో మరో అమ్మాయితో క్లోజ్ అవ్వడం.. హౌస్ నుంచి బయటకు వచ్చాక రతికను దూరం చేసి ఆ అమ్మాయితోనే క్లోజ్ గా ఉండటం వల్ల రతిక అతనికి దూరమైందట. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ తో రతిక లవ్ స్టోరీపై సోషల్ మీడియాలో ఇప్పటికే వార్తలు జోరందుకున్నాయి. అతను సీజన్ టైటిల్ విన్నర్ కూడా అవడం విశేషం. అయితే రతిక వెర్షన్ ఇలా ఉంది మరి ఆమెతో అతని లవ్ స్టోరీ నిజమేనా కాదా అన్నది అతని వెర్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
రీసెంట్ ఎపిసోడ్ లో రతిక బాధగా ఫీల్ అవుతున్న టైం లో తల్లిదండ్రులు కాకుండా మనకు బాగా దగ్గరైన వారిని ఫీల్ అవుతున్నా అంటూ బాధపడింది. ఇంతకీ రతిక సదరు బిగ్ బాస్ విన్నర్ లవ్ స్టోరీ అసలు ఎందుకు బ్రేక్ అయ్యింది. వారి మధ్య అసలేం జరిగింది అన్నది తెలియాల్సి ఉంది. హౌస్ లో ఉన్న రతికకు ఆ ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్ సపోర్ట్ చేస్తాడా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది.