Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7.. టైమింగ్స్ ఏంటి..?

అయితే బిగ్ బాస్ గత రెండు సీజన్ల నుంచి రాత్రి 10 గంటల నుంచి వస్తుంది. అప్పటి నుంచి 11 గంటల వరకు చూడాల్సి వస్తుంది

By:  Tupaki Desk   |   29 Aug 2023 5:00 AM GMT
బిగ్ బాస్ 7.. టైమింగ్స్ ఏంటి..?
X

ఆరు సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ కి రెడీ అవుతుంది. ఈ సీజన్ సరికొత్త టాస్క్ లతో ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉల్టా పుల్టా అంటూ హోస్ట్ నాగార్జున చేస్తున్న ప్రోమోస్ క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ 7 లోకి ఎవరెవరు వస్తున్నారంటూ ఒక లిస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ రివ్యూయర్స్ కూడా యుద్ధానికి సన్నద్ధం అన్నట్టుగా రెడీ అవుతున్నారు.

అయితే బిగ్ బాస్ గత రెండు సీజన్ల నుంచి రాత్రి 10 గంటల నుంచి వస్తుంది. అప్పటి నుంచి 11 గంటల వరకు చూడాల్సి వస్తుంది. అయితే నాలుగో సీజన్ వరకు బిగ్ బాస్ రాత్రి 9:30 నుంచి 10:30 వరకు వచ్చేది. వీకెండ్ నాగార్జున ఎపిసోడ్ మాత్రం శని ఆదివారాల్లో రాత్రి 9 నుంచి 10:30 వరకు వస్తుంది. హోస్ట్ ఎపిసోడ్ టైమింగ్స్ అలానే ఉండగా మండే టు ఫ్రైడే ఎపిసోడ్స్ మాత్రం 10 గంటల నుంచి పెట్టారు. దీనిపై ఆడియన్స్ నుంచి చాలా కామెంట్స్ వచ్చాయి.

అందుకే ఈసారి బిగ్ బాస్ 7 ని రాత్రి 9:30 నుంచి 10:30 వరకు టెలికాస్ట్ చేస్తారట. స్టార్ మా కి బిగ్ బాస్ వల్ల మంచి టి.ఆర్.పి వస్తుంది. షో జరిగే 3 నెలలు కూడా స్టార్ మా చూసే ఫాలోవర్స్ ఎక్కువమంది ఉంటారు. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 7 ఆరో సీజన్ లానే లైవ్ కూడా ఉంటుందని అంటున్నారు. డిస్నీ హాట్ స్టార్ లో లైవ్ చూసేయొచ్చు.

సీజన్ 6 ఫ్లాప్ అవడం వల్ల ఈ సీజన్ ని ఎలాగైనా హిట్ చేయాలని బిగ్ బాస్ టీం సరికొత్త ప్లానింగ్ తో ఉన్నారు. తప్పకుండా బిగ్ బాస్ 7 ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేలా ఉంటుందని టాక్. అయితే బయటకు లీక్ అయిన కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ కాదని చివరి నిమిషంలో కూడా హౌస్ మేట్స్ ని మార్చే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా బిగ్ బాస్ 7 ఆడియన్స్ లో క్యూరియాసిటీ తెచ్చేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తుందని చెప్పొచ్చు. సెప్టెంబర్ 3న మొదలవుతున్న బిగ్ బాస్ 7 ఓపెనింగ్ ఎపిసోడ్ కూడా భారీగానే ప్లాన్ చేశారని తెలుస్తుంది.