Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : ఆరంభం అదిరింది..!

బిగ్ బాస్ సీజన్ 7 ఆదివారం మొదలైంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా మొదలైన ఈ సీజన్ ఆరంభం అదిరిపోయింది.

By:  Tupaki Desk   |   4 Sep 2023 4:22 AM GMT
బిగ్ బాస్ 7 : ఆరంభం అదిరింది..!
X

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఆదివారం మొదలైంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా మొదలైన ఈ సీజన్ ఆరంభం అదిరిపోయింది. ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో ప్రోమోస్ తోనే ఈ సీజన్ పై అంచనాలు పెంచారు బిగ్ బాస్ టీం. ఇక ఈ సీజన్ మొదటి నుంచే ఆట మొదలు పెట్టాడు బిగ్ బాస్. మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ యాక్టర్ ప్రియాంకా జైన్ ని ఆహ్వానించాడు హోస్ట్ నాగార్జున. హౌజ్ లో ఆమెకు ముందే ఒక సూట్ కేస్ ఆఫర్ ఇచ్చి దాన్ని సీక్రెట్ గా ఉంచమని చెప్పారు. బిగ్ బాస్ హౌజ్ లో మొదటి కంటెస్టెంట్ గా ప్రియాంకా జైన్ హౌజ్ అంతా కూడా సరదా సరదాగా తిరిగేసింది.

ఈ సీజన్ లో రెండో కంటెస్టెంట్ గా శివాజి వచ్చారు. సినీ పరిశ్రమలో అతను పడిన కష్టాలు తన సమస్యల గురించి చెప్పిన శివాజి ఆడియో విజువల్ తో ఆడియన్స్ ని టచ్ చేశాడు. శివాజి ప్రోమో తర్వాత నాగార్జున ఆయనని స్టేజ్ మీదకు పిలిచి ఇక్కడ నిన్ను చూస్తానని అనుకోలేదని అన్నారు నాగార్జున. నాకు మొదటి చెక్ ఇచ్చింది మీరే.. సీతారాముల కళ్యాణం సినిమా కోసం ఇచ్చారని నా ఫస్ట్ ఇన్నింగ్స్ మొదలైంది అన్నపూర్ణ స్టూడియోలోనే.. రెండో ఇన్నింగ్స్ కూడా ఇక్కడే మొదలవుతుందని అన్నారు శివాజి.

బిగ్ బాస్ సీజన్ 7 లో 3వ కంటెస్టెంట్ గా సింగర్ దామిని హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కొండపొలం సినిమాలో పాటకి నేషనల్ అవార్డ్ రావడంపై ఆమెకు కంగ్రాట్స్ చెపారు నాగార్జున. స్టేజ్ మీద దామిని ఆ పాట పాడారు. దేవుడు అంటే ఇష్టమని.. మానవ సేవే మాధవ సేవ అని షిర్డీ సాయిబాబా సినిమాలో మీరు చెప్పారని గుర్తు చేసింది ధామిని. ఆమెకు నాగార్జున చిన్న గిఫ్ట్ ఇచ్చారు.

ఈ సీజన్ లో మోడల్ కేటగిరిలో ఎంట్రీ ఇచ్చాడు ప్రిన్స్ యావర్. బిగ్ బాస్ 7 నాల్గవ కంటెస్టెంట్ గా ప్రిన్స్ యావర్ వచ్చాడు. మోడల్, ఫ్యాషన్ పర్సనాలిటీగా ప్రిన్స్ యావర్ కు మంచి గుర్తింపు ఉంది. తాను మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పిన ప్రిన్స్ యార్ తనకు తెలుగు రాదని.. ఇంగ్లీష్, హిందీ మిక్స్ చేసి మాట్లాడతా అన్నాడు. ప్రిన్స్ యావర్ విషయంలో నాగార్జున ఒక ట్విస్ట్ ఇచ్చారు. కంటెస్టంట్ గా ఎంట్రీ ఇచ్చావు కానీ హౌజ్ మెట్ గా కన్ఫర్మ్ కాలేదని అన్నారు నాగార్జున.

ఈ సీజన్ ఐదో కంటెస్టెంట్ గా శుభ శ్రీ రాయగురు ఎంట్రీ ఇచ్చారు. ఆమె ఒక లాయర్ కానీ యాక్టింగ్ మీద ఆసక్తితో పరిశ్రమకు వచ్చింది. మాస్ సినిమా టైం లో అమ్మాయిలకు మీరంటే చాలా ఇష్టమని అన్నది. శుభ శ్రీ కి కూడా నాగార్జున ట్విస్ట్ ఇచ్చారు. కంటెస్టెంట్ గా ఓకే కానీ హౌజ్ మెట్ గా కాదు.. అందుకే నీకు బెడ్ లేదు. పవర్ సూత్ర గెలుచుకుంటేనే నీకు బెడ్ వస్తుందని అన్నారు. అలా ఆమె హౌజ్ లోకి వెళ్లింది.

హౌజ్ లోకి 6వ కంటెస్టెంట్ గా షకీలా ఎంట్రీ ఇచ్చారు. ఆమె ఏవీలో కూడా ఎమోషనల్ గా మాట్లాడారు. బిగ్ బాస్ కు ఎందుకు వచ్చావని నాగార్జున ఆమెని అడిగారు. ఈ షోకి రాక ముందు నా జీవితం వేరు ఇప్పుడు నా జీవితం వేరని అన్నారు షకీల. మిమ్మల్ని చూస్తుంటే అన్నమయ్యని చూసినట్టు ఉందని షకీలా అన్నారు. నాగ్ కూడా ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు షకీల పెంచే ఇద్దరు ట్రాన్స్ జెండర్స్ తో మాట్లాడించి ఆమెను సర్ ప్రైజ్ చేశారు.

బిగ్ బాస్ ప్రతి సీజన్ లో ఒక డ్యాన్స్ మాస్టర్ ఉంటాడు. ఈ సీజన్ లో కూడా 7వ కంటెస్టెంట్ గా ఆట సందీప్ హౌజ్ లోకి వచ్చాడు. కొరియోగ్రాఫర్, యాక్టర్, భర్త, తండ్రి ఈ బాధ్యతల్లో నీకు ఎలాంటి రోల్ అంటే ఇష్టమని అన్నారు. అయితే దానికి ఆట సందీప్ ఫస్ట్ కొరియోగ్రాఫర్ ఆ తర్వాత యాక్టర్ అని అన్నారు. తండ్రి భర్త వాటిలో ఏ పాత్ర ఇష్టమంటే.. తండ్రిగానే ఇష్టపడతా అని చెప్పాడు. ఆల్రెడీ ఒక రియాలిటీ షో గెలిచావు.. మరో రియాలిటీ షోకి వచ్చావు అనగా అది కష్టపడి గెలిచా.. ఇప్పుడు మరింత కష్టపడతా అన్నాడు ఆట సందీప్.

ఈ సీజన్ మరో క్రేజీ కంటెస్టెంట్ గా కార్తీక దీపం ఫేం మోనిత అలియాస్ శోభా శెట్టి వచ్చారు. ఈ సీజన్ లో 8వ కంటెస్టెంట్ గా ఆమె ఎంట్రీ ఇచ్చారు. నాగార్జున ఆమెను పలకరించగా ఐలవ్యూ అని చెప్పగా నాగార్జున కూడా ఐ లవ్ యూ టూ అని చెప్పారు. మోనితగా వచ్చావా..? శోభగా వచ్చావా..? అంటే కార్తీక దీపం మోనిత నెగెటివ్ క్యారెక్టర్ గా కనిపించా.. శోభగానే అడుగు పెడుతాను అని అన్నది శోభా శెట్టి.

ఈ సీజన్ 9వ కంటెస్టెంట్ గా టేస్టీ తేజా ఎంట్రీ ఇచ్చాడు. సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా మొదలై యూట్యూబర్ గా తన కెరీర్ గురించి చెప్పిన టేస్టీ తేజా మొరగని కుక్క లేదు.. తిట్టని నోరు లేదు.. మన పని మనం చేసుకుంటూ పోవాలి. అర్ధమైందా రాజా అనే డైలాగ్ తో స్టేజ్ మీదకు వచ్చిన తేజా కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో షోలు చేసి యూట్యూబర్ గా సెటిల్ అయ్యానని అన్నాడు.

బిగ్ బాస్ సీజన్ 7లో 10వ కంటెస్టెంట్ గా సోషల్ మీడియా ఇంఫ్లూ యెన్సర్ రతిత ఎంట్రీ ఇచ్చారు. స్టేజ్ మీదకు రాగానే బ్రేకప్ నుంచి బయపడ్డావా అంటే అవును బయట పడ్డాననని అన్నది. అందుకు మీరే కారణం చేసిందంత మీరే అంటూ రతిక షాక్ ఇచ్చింది. నేనేం చేశాను అంటే అది ఇంట్లోకి వెళ్లిన తర్వాత తెలుస్తుందని అన్నది రతిక.

ఈ సీజన్ 11వ కంటెస్టెంట్ గా డాక్టర్ కం యాక్టర్ గౌతం కృష్ణ ఎంట్రీ ఇచ్చాడు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన గౌతం ఆకాశ వీధుల్లో సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. యాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది. ఇంట్లో చెబితే చదువు పూర్తయితే కానీ సపోర్ట్ చేయమని అన్నారు. అలా డాక్టర్ గా మారి యాక్టర్ అయ్యానని అన్నాడు గౌతం కృష్ణ. నా మొదటి సినిమా మీ టైటిల్ తో వచ్చిందని అన్నాడు గౌతం కృష్ణ.

బిగ్ బాస్ 12వ కంటెస్టెంట్ గా సీనియర్ యాక్టర్ కిరణ్ రాథోడ్ హౌజ్ లోకి వచ్చారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రాణించిన ఆమె తెలుగు రాదు కానీ తప్పకుండా నేర్చుకుంటానని అన్నారు. శివాజి తెలుగు టీచర్.. అతడితో కలిసి నేర్చుకో అని నాగ్ సలహా ఇచ్చారు. ఫోన్ లేకుండా, ఫ్యామిలీ లేకుండా ఉండటం కష్టం.. ఎలా ఉంటుందో చూస్తానని హౌజ్ లోకి వెళ్లారు కిరణ్ రాథోడ్.

బిగ్ బాస్ సీజన్ 7 లో 13వ కంటెస్టెంట్ గా యూట్యూబర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ హౌజ్ లోకి వచ్చాడు. పేదరికంలో బతికి చచ్చిపోదామని అనుకున్నా అలా చేస్తే మా నాన్న కూడా చనిపోతానని అన్నాడు. ఆ ప్రయత్నం విరమించుకుని వీడియోలు చేశా బిగ్ బాస్ లోకి వెళ్లాలని వీడియో చేశా.. ఇలా అవకాశం వచ్చిందని అన్నాడు పల్లవి ప్రకాష్. నాగార్జున కోసం తన పొలంలో పండిన వడ్లు, తన ఊరు మట్టిని బహుమతిగా ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. అయితే నాగార్జున మిర్చి వస్తే బెనిఫిట్ ఉంటుంది.. మొక్క వాడితే జరిమానా ఉంటుందని నాగార్జున చెప్పారు.

ఇక చివరగా 14వ కంటెస్టంట్ గా అమర్ దీప్ వచ్చాడు. అతని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ని మెచ్చుకున్న నాగార్జున నీవు హై ఇన్ ఫ్లేమబుల్ అంట కదా అని అన్నారు. అందుకు అమర్ దీప్ కూడా అవునని చెప్పాడు. ఒక మాట అనడం వల్ల అలాంటి పేరు వచ్చిందని అన్నాడు అమర్ దీప్. మె సినిమా రక్షకుడు వల్లే అలాంటి పేరు వచ్చిందని అమర్ దీప్ చెప్పాడు.

అలా 14 మంది కంటెస్టెంట్స్ ని హౌజ్ లోకి పంపించి బిగ్ బాస్ సీజన్ 7 లాంచింగ్ ఎపిసోడ్ ఆడియన్స్ కి సూపర్ ఎంటర్టైన్మెంట్ అందించింది. ఓపెనింగ్ ఎపిసోడ్ లో ఖుషి ప్రమోషన్స్ కోసం విజయ్ దేవరకొండ రాగా హీరోయిన్ రాలేదేంటని నాగార్జున అడిగారు. ఇక మరోపక్క మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ప్రమోషన్స్ లో భాగంగా నవీన్ పొలిశెట్టి కూడా హౌజ్ లో ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు.

అలా మొదటి ఎపిసోడ్ ప్రారంభం అదిరింది. క్రేజీ కంటెస్టెంట్స్.. కావాల్సినంత స్టఫ్ ఈ సీజన్ హైప్ పెంచేందుకు కంటెస్టెంట్లు.. సక్సెస్ చేసే టాస్క్ లు కచ్చితంగా షోని రసవత్తరంగా మార్చేలా ఉన్నాయి. సో బుల్లితెర ప్రేక్షకులకు 100 రోజుల పాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు.