Begin typing your search above and press return to search.

రెండో రోజుకే పైపు తిప్పేసి.. ఇంటికి వెళ్లిపోతానన్న హాట్ బ్యూటీ

పోటుగాళ్ల నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యాక.. ట్విస్టు ఇచ్చిన బిగ్ బాస్.. ఆటగాళ్లకు నామినేషన్లు చేసే అవకాశాన్ని ఇచ్చాడు

By:  Tupaki Desk   |   10 Oct 2023 5:29 AM GMT
రెండో రోజుకే పైపు తిప్పేసి.. ఇంటికి వెళ్లిపోతానన్న హాట్ బ్యూటీ
X

ఇంట్లో కూర్చొని టీవీలో బిగ్ బాస్ చూసే వారంతా జడ్జిమెంట్లు ఇచ్చి పారేస్తుంటారు. హౌస్ లోకి వెళ్లి.. అక్కడున్నోళ్లను తట్టుకోవటం ఒక ఎత్తు అయితే.. బయట ఉన్న కోట్లాది మంది ప్రేక్షకుల మనసుల్ని దోచేయటం అంత తేలికైన విషయం కాదు. బిగ్ బాస్ సీజన్ 7లో ‘ఉల్టా పల్టా’ పేరుతో జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ లో ఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో.. ఒకేసారి ఐదుగురు కంటెస్టెంట్లను వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది లేదు. అలా వచ్చిన వారిలో ఒక బ్యూటీకి రెండో రోజే దిమ్మ తిరిగిపోవటమే కాదు.. నేనెళ్లిపోతా.. ఇంటికి వెళ్లిపోతానంటూ కన్నీళ్ల ట్యాంక్ ట్యాప్ ఓపెన్ చేయటమే కాదు.. తనను బయటకు పంపేయాలని కోరుకోవటం షాకింగ్ గా మారింది.

ఇంతకూ ఆ బ్యూటీ ఎవరో కాదు.. అశ్విని. ఆదివారం ఎపిసోడ్ లో వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌస్ లోకి పంపటం.. వారికి సంబంధించిన వీడియోలు.. వారి ఇంటర్వ్యూలతో నింపేయగా.. సోమవారం ఎపిసోడ్ వారంతా నిద్ర లేవటంతో మొదలుకావటం.. పొద్దుపొద్దున్నే ఫిట్టింగ్ పెట్టేశాడు బిగ్ బాస్. అప్పటివరకు ఇంట్లో ఉన్నోళ్లు ఆటగాళ్లు అని.. కొత్తగా హౌస్ లోకి వచ్చినోళ్లు పోటుగాళ్లు అని చెప్పటమే కాదు.. వారికి ఎలిమినేషన్ చేసే అవకాశం ఇచ్చారు. ఒక్కొక్కరు ఇద్దరిని ఎలిమినేషన్ చేయొచ్చని చెప్పి.. వారి చేత ఎలిమినేషన్ల కార్యక్రమాన్ని పెట్టేశాడు.

ఎవరెవరిని నామినేట్ చేశారంటే..

నయని పావని - తేజ, అమరదీప్

భోలె షావళి - అమరదీప్, సందీప్

అశ్విని - అమరదీప్, శోభాశెట్టి

పూజామూర్తి - తేజ, యువర్

అర్జున్ - సందీప్, అమరదీప్

నామినేషన్లు చేసే సమయంలో తాను నామినేట్స్ చేయటానికి కారణం ఫలానా అని చెప్పే క్రమంలో అశ్విని పాప.. అమరదీప్ ను స్వార్థంతో ఆడుతున్నాడని.. శోభాశెట్టిని గ్రూపిజంతో ఆడుతుందని చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించి అశ్విని కన్ఫ్యూజ్ చేసేసింది. దీంతో.. వారిద్దరి మధ్య గొడవైంది. దీంతో శోభా గురించి బరస్ట్ అయిన అశ్విని.. కన్నీళ్లు పెట్టుకుంటే బిగ్ బాస్ హౌస్ కు తాను మహారాణి అనుకుంటుందా? అని వాపోయింది. హౌస్ లోకి అడుగు పెట్టినప్పటికీ తాను గమనిస్తున్నానని.. శోభాశెట్టి అండ్ కో తనను సపరేట్ చేసినట్లుగా చెప్పి మరోసారి ఏడ్చేసింది.

పోటుగాళ్ల నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యాక.. ట్విస్టు ఇచ్చిన బిగ్ బాస్.. ఆటగాళ్లకు నామినేషన్లు చేసే అవకాశాన్ని ఇచ్చాడు. అయితే.. ఆటగాళ్లలో ఒకరు పాత సభ్యుల్లో ఒకరిని.. మరొకరిని కొత్త సభ్యుల్లోని వారిని ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. దీంతో.. అశ్విని, అమరదీప, పూజామూర్తి ముగ్గురు చొప్పున నామినేట్ చేస్తే.. తేజ, నయని పావనిని ఇద్దరు చొప్పున నామినేట్ చేశారు. అయితే.. తననే అందరూ టార్గెట్ చేశారంటూ అశ్విని మరోసారి ఏడుపు లంకించుకుంది. ఈ క్రమంలో ఆమె పక్కనున్న వారు ఆమెను సముదాయించే ప్రయత్నం చేయగా.. చిన్న పిల్లలా ఏడ్చేసిన ఆశ్విని.. తాను ఇంటికి వెళ్లిపోతానని.. తనను ఎలిమినేట్ చేసేయండని చెప్పటంతో.. ఏంటి రెండో రోజుకే ఇంటికి వెళ్లిపోవటమా? అంటూ టీవీల్లో బిగ్ బాస్ చూసే వారంతా అశ్విని విషయంలో అవాక్కుఅయ్యే పరిస్థితి.