Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ హోస్ట్.. ఇది అసలు ఉహించలేదు

బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. కింగ్ నాగార్జున హోస్ట్ గా తెలుగు బిగ్ బాస్ కూడా బాగా క్లిక్ అయ్యింది

By:  Tupaki Desk   |   15 Jun 2024 6:49 AM GMT
బిగ్ బాస్ హోస్ట్.. ఇది అసలు ఉహించలేదు
X

బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. కింగ్ నాగార్జున హోస్ట్ గా తెలుగు బిగ్ బాస్ కూడా బాగా క్లిక్ అయ్యింది. ఇప్పటి వరకు ఏడు సీజన్స్ నడిచాయి. అన్నింటికంటే సీజన్ 7కి ఎక్కువ ఆదరణ లభించింది. మొదటి సారి బిగ్ బాస్ చరిత్రలో ఒక కామన్ మెన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. కనీసం రెండు, మూడు వారాలు కూడా హౌస్ లో ఉండడు అనుకున్న పల్లవి ప్రశాంత్ మెల్లగా ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నాడు.

గత సీజన్ లో యాక్టర్ శివాజీ కూడా కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేశారు. టాప్ కంటెస్టెంట్స్ లలో ఒకరుగా నిలబడ్డారు. పల్లవి ప్రశాంత్ విన్నర్ కావడానికి శివాజీ పరోక్షంగా కారణం అయ్యారు. అతనికి చాలా విషయాలలో హౌస్ లో అండగా నిలబడ్డారు. సీరియల్ యాక్టర్స్ ఎంతగా పల్లవి ప్రశాంత్ తో ఆడుకున్న అతనికి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 కి రంగం సిద్ధం అవుతోంది. కంటిస్టెంట్ లో ఎంపిక జరుగుతుంది.

ప్రతి సీజన్ కి ముందు హోస్ట్ పై సోషల్ మీడియాలో ఓ కొత్త ప్రచారం నడుస్తూ ఉంటుంది. హోస్ట్ గా ఈ సారి వేరొకరు వస్తారంటూ కథనాలు వైరల్ అవుతూ ఉంటాయి. ఈ సారి కూడా బిగ్ బాస్ హోస్ట్ గా కొత్త పేరు తెరపైకి వచ్చింది. సీజన్ 7 లో కంటిస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన శివాజీ హోస్ట్ గా మారబోతున్నాడు అంటూ టాక్. అయితే ఇందులో వాస్తవం ఉండకపోవచ్చనే మాట కూడా వినిపిస్తోంది. మేగ్జిమమ్ కింగ్ నాగార్జుననే సీజన్ 8కి కూడా పోస్ట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

హిందీలో సల్మాన్ ఖాన్, కోలీవుడ్ లో కమల్ హాసన్, కన్నడంలో సుదీప్, మలయాళీలో మోహన్ లాల్ బిగ్ బాస్ షోలకి హోస్ట్ లుగా ఉన్నారు. అలాగే తెలుగులో కింగ్ నాగార్జున హోస్ట్ గా ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లే. అతనిని మార్చే ప్రయత్నం స్టార్ మా చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. కొత్తగా ఎవరి పేర్లు తెరపైకి వచ్చిన అవన్నీ కూడా కేవలం ప్రచారంలో మాత్రమే ఉంటాయి.

ఈ సీజన్ కి కూడా యుట్యూబ్ ఇన్ ఫ్ల్యూయెన్సర్స్ తో పాటు సీరియల్ సెలబ్రెటీలు, సినిమా ఇండస్ట్రీకి చెందిన అవుట్ డేటెడ్ యాక్టర్స్ ని ఎంపిక చేసే పనిలో నిర్వాహకులు ఉన్నారంట. మరి ఈ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుందనేది వేచి చూడాలి.