Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ గొంతు ఇతడిదే.. కొత్త నిజం బయటకు

నిజానికి ఈ షో కంటే ముందు ఎన్నో సినిమాలకు ఆయన డబ్బింగ్ చెప్పి పేరు తెచ్చుకున్నారు

By:  Tupaki Desk   |   15 Sep 2023 3:59 AM GMT
బిగ్ బాస్ గొంతు ఇతడిదే.. కొత్త నిజం బయటకు
X

రియాల్టీ షోలు ఎన్ని ఉన్నా.. ఒక ఇంట్లో వంద రోజుల పాటు.. భిన్న వ్యక్తిత్వాలు.. సంబంధం లేని నేపథ్యాల నుంచి వచ్చిన డజనకు పైగా కంటెస్టెంట్లను ఒక ఇంట్లో ఉంచేసి.. ప్రపంచానికి దూరంగా.. సంబంధం లేని విధంగా మార్చేసి.. వారితో ఆటలు ఆడించే బిగ్ బాస్ రియాల్టీ షో.. భాష ఏదైనా.. ప్రాంతం ఏదైనా సక్సెస్ మాత్రం దాని సొంతం అన్న రీతిలో సాగుతుంటుంది. తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 నడుస్తోంది. తాజా సీజన్ సెప్టెంబరు 3న మొదలైంది. మొత్తం హౌస్ లోకి పద్నాలుగు మంది అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.

ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే అనుకుంటే.. ఈ రియాల్టీ షోలో కనిపించకుండా.. నిత్యం వినిపించే బిగ్ బాస్ వాయిస్ మీద పెద్ద ఎత్తున క్యూరిసిటీ వ్యక్తమవుతుంటుంది. ఇంతకీ ఈ వాయిస్ ఎవరిది? అన్న ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. ఎప్పుడు కనిపించకుండా వినిపించే వాయిస్ కు సంబంధించిన సీక్రెట్ బయటకు వచ్చింది. ఇంతకూ ఆ వాయిస్ ఎవరిదో కాదు.. డబ్బింగ్ ఆర్టిస్ట్ శంకర్. గంభీరమైన స్వరం.. ఎన్నిసార్లు విన్నా.. వినేందుకు అందరికి ఓకే అనిపించేలా ఉన్న ఈ వాయిస్.. బిగ్ బాస్ తెలుగు సీజన్ మొదలు పెట్టినప్పటి నుంచి ఆయనే చెబుతున్నారు.

నిజానికి ఈ షో కంటే ముందు ఎన్నో సినిమాలకు ఆయన డబ్బింగ్ చెప్పి పేరు తెచ్చుకున్నారు. పలు సీరియల్స్ లోనూ.. యాడ్స్ లోనూ ఆయన మాట వినిపిస్తుంటుంది. బిగ్ బాస్ షోను తెలుగులో స్టార్ట్ చేద్దామనుకున్నప్పుడు దాదాపు వంద మందిని ఆడిషన్ చేసి.. చివరకు శంకర్ ను ఓకే చేశారు. ఆయన గొంతులోని గాంభీర్యమే ఆయనకు బిగ్ బాస్ అవకాశాన్ని సొంతం చేసేలా చేసిందని చెబుతుంటారు.బిగ్ బాస్ మొదటి మూడు నాలుగు సీజన్లకు ఒకలా మాట్లాడిన శంకర్.. తర్వాత తన మాడ్యులేషన్ కాస్త మార్చారు. ఆ తర్వాత దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. మొత్తానికి బిగ్ బాస్ వాయిస్ కు సంబంధించిన గుట్టు తాజాగా రట్టు అయ్యిందని చెప్పక తప్పదు.