Begin typing your search above and press return to search.

బిగ్ బాస్.. ఒకప్పటి స్టార్ హీరో ఎంట్రీ?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి

By:  Tupaki Desk   |   26 July 2024 3:01 PM GMT
బిగ్ బాస్.. ఒకప్పటి స్టార్ హీరో ఎంట్రీ?
X

తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. ఈ సీజన్ కోసం కంటెస్టెంట్ ల ఎంపిక కూడా ఆల్ మోస్ట్ జరిగిపోయినట్లు తెలుస్తోంది. సీజన్ సెవెన్ లో కామన్ మ్యాన్ క్యాటగిరీలో వచ్చిన పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచారు. బిగ్ బాస్ హిస్టరీ లో ఫస్ట్ టైం ఇలా కామన్ మెన్ కేటగిరిలో ఒక వ్యక్తి వచ్చి విన్నర్ కావడం విశేషం. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా బిగ్ బాస్ రియాల్టీ షోకి అద్భుతమైన ఆదరణ లభిస్తూ ఉంది.

అన్ని భాషలలో స్టార్ యాక్టర్స్ బిగ్ బాస్ షోలకి హోస్ట్ లుగా చేస్తున్నారు. తెలుగులో కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ రియాలిటీ షో కొనసాగుతోంది. ప్రస్తుతం హిందీలో బిగ్ బాస్ ఓటీటీ షో నడుస్తోంది. అది కాస్త ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ సెవెన్ అద్భుతమైన ఆదరణ లభించింది. అంతకుమించి సక్సెస్ ని అందుకోవాలని బిగ్ బాస్ సీజన్ 8కి అదిరిపోయే రేంజ్ లో ఏర్పాటు చేస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 8లో కిర్రాక్ ఆర్పీ, అమృతా ప్రణయ్, నిఖిల్(యాంకర్), కుమారీ ఆంటీ, బర్రెలక్క, అనీల్ గీలా(యూట్యూబర్), బుల్లెట్ భాస్కర్, బమ్ చిక్ బబ్లూ, వంశీ లతో పాటు రీతూ చౌదరి, సోనియా సింగ్, కుషితా కల్లపు, సుప్రిత, అంజలి పవన్, వింధ్య విశాక, వర్షిణి , నయన పావని, విష్ణు ప్రియ పాల్గొనబోతున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే వీరిలో ఎంతమంది ఫైనల్ గా ఉంటారు అనేది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కోసం మరో ఇంటరెస్టింగ్ పేరు కూడా వినిపిస్తోంది. ఒకప్పటి హీరో, అమ్మాయిల కలల రాకుమారుడు అబ్బాస్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 8కి కంటెస్టెంట్ గా వచ్చే అవకాశం ఉందంట. ఒకప్పుడు ఈ హీరోకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. కుర్రాళ్ళు కూడా అబ్బాస్ హెయిర్ స్టైల్ అంటూ అతన్ని ఫాలో అవుతూ ఉండేవారు. అంతగా ఫేమ్ ఉన్న ఈ యాక్టర్ తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేక సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం విదేశాలలో ఉంటున్నట్లు తెలుస్తోంది.

అయితే మరల సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఆయన రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షోని ప్లాట్ ఫామ్ గా చేసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ షోలో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఫిల్మ్ సర్కిల్ లో అతని పేరు వినిపించే అవకాశం ఉంటుంది. అప్పుడు అరవింద్ స్వామి తరహాలో స్టైలిష్ విలన్ పాత్రలకు అబ్బాస్ ని ఎంపిక చేసుకొనే ఛాన్స్ ఉంది. మరి తెలుగు బిగ్ బాస్ లో అబ్బాస్ ఎంట్రీ ఎంతవరకు ఉంటుందనేది తెలియాలంటే షో ప్రారంభం అయ్యేంతవరకు వేచి చూడాల్సిందే.