చిన్న సినిమాలతోనే పెద్ద లాభాలు
వీటికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తూ ఉండడంతో కలెక్షన్స్ కూడా సాలిడ్ గా వస్తున్నాయి.
By: Tupaki Desk | 17 May 2024 4:29 AM GMTటాలీవుడ్ లో గత కొన్నేళ్ల నుంచి చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ టాక్స్ తో రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తున్నాయి. దర్శకులు డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించిన స్థాయిలో సక్సెస్ లు అందుకుంటున్నారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ నుంచి బయటకు వచ్చి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ తో కొత్త కథలను లేదంటే రియాలిస్టిక్ కథనాలను విజువల్ గా తెరపై చూపిస్తున్నారు. వీటికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తూ ఉండడంతో కలెక్షన్స్ కూడా సాలిడ్ గా వస్తున్నాయి.
ఇప్పటివరకు టాలీవుడ్ లో చిన్న, మీడియం రేంజ్ చిత్రాలుగా రిలీజ్ అయ్యి భారీ లాభాలు అర్జించిన మూవీస్ జాబితా చూసుకుంటే ఇలా ఉంది. టాప్ వన్ లో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన హనుమాన్ మూవీ నిలిచింది. ఈ సినిమా 29.65 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యి ఏకంగా 127.95 కోట్ల ప్రాఫిట్ ని సంపాదించింది. హనుమాన్ మూవీ అంచనాలకు మించి పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకోవడంతో ఈ ప్రాఫిట్ సాధ్యమైంది.
రెండో స్థానంలో విజయ్ దేవరకొండ గీతగోవిందం మూవీ ఉంది. 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ చిత్రం 55.43 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది. మూడో స్థానంలో నిఖిల్ కార్తికేయ2 మూవీ నిలిచింది. ఈ మూవీ 12.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్స్ లోకి వచ్చి ఏకంగా 45.60 కోట్ల ప్రాఫిట్ సాధించింది. టాప్ 4లో సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ మూవీ నిలవడం విశేషం.
ఈ చిత్రం 27 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యి 47 కోట్ల ప్రాఫిట్ అందుకుంది. బేబీ మూవీ 7.40 కోట్ల టార్గెట్ తో థియేటర్స్ లోకి వచ్చి ఏకంగా 37.25 కోట్ల ప్రాఫిట్ అందించింది. వైష్ణవ్ తేజ్ మొదటి చిత్రం ఉప్పెన 20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యి 31.02 కోట్ల ప్రాఫిట్ దక్కించుకుంది. వరుణ్ తేజ్ ఫిదా మూవీ 15 కోట్ల టార్గెట్ తో వచ్చి 30.05 కోట్ల ప్రాఫిట్ సాధించింది. దుల్కర్ సల్మాన్ సీతారామం మూవీ 16.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్స్ లోకి వచ్చి 30.30 కోట్ల ప్రాఫిట్ అందించింది.
సాయిధరమ్ తేజ్ విరూపాక్ష 22.20 కోట్ల టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి 26 కోట్ల ప్రాఫిట్ దక్కించుకుంది. జాతి రత్నాలు 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యి 27.52 కోట్ల ప్రాఫిట్ సాధించింది. ఇస్మార్ట్ శంకర్ 17.7 కోట్ల టార్గెట్ తో థియేటర్స్ లోకి వచ్చి 22.78 కోట్ల ప్రాఫిట్ సొంతం చేసుకుంది. బింబిసార 15.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యి 22.3 2 కోట్ల ప్రాఫిట్ అందుకుంది. అర్జున్ రెడ్డి 5.5 కోట్ల టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి 20.3 కోట్ల ప్రాఫిట్ ని అందుకోగలిగింది.
అంచనాల ప్రకారం టాప్ ప్రాఫిట్స్ అందించిన మీడియం/చిన్న రేంజ్ సినిమాలివే
హనుమాన్ : 127.95CR
గీతాగోవిందం - 55.43Cr
కార్తికేయ 2 - 45.60Cr
టిల్లు స్క్వేర్ - 42 Cr
బేబీ - 37.25Cr
ఉప్పెన - 31.02Cr
ఫిదా - 30.5Cr
సీతారామం - 30.30Cr
విరూపాక్ష - 26.00Cr
జాతిరత్నాలు - 27.52Cr
ఇస్మార్ట్ శంకర్ - 22.78Cr
బింబిసార - 22.32Cr(15.6Cr)
అర్జున్ రెడ్డి - 20.3Cr(5.5Cr)