అత్యంత అందగత్తె అయిన బైకర్ స్పాట్ డెడ్
ప్రపంచంలోనే అత్యంత అందగత్తె అయిన లేడీ బైకర్ టాట్యానా ఓజోలినా దుర్మరణం పాలయ్యారు
By: Tupaki Desk | 24 July 2024 4:16 PM GMTప్రపంచంలోనే అత్యంత అందగత్తె అయిన లేడీ బైకర్ టాట్యానా ఓజోలినా దుర్మరణం పాలయ్యారు. ఆమె అందానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి ఫ్యాన్సున్నారు. సోషల్ మీడియాల్లో తనను భారీగా ఫాలోవర్స్ అనుసరిస్తున్నారు. అయితే తాను నడుపుతున్న మోటార్‌సైకిల్‌పై నియంత్రణ కోల్పోయి మిలాస్ (టర్కీ) సమీపంలో ట్రక్కును ఢీకొట్టిన ఘటనలో దుర్మరణం పాలవ్వడం అభిమానులను కలచివేసింది.
టాట్యానా ఓజోలినా తనదైన అందం .. మోటార్ సైకిళ్లపై అభిరుచితో నిరంతరం వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఆమె పాపులర్ రష్యన్ ఇన్ఫ్లుయెన్సర్. టర్కీలో విహారయాత్రలో ఉన్నప్పుడు ఆమె ప్రమాదంలో మరణించింది. టర్కీలోని ముగ్లా - బోడ్రమ్ మధ్య తన ఎరుపు రంగు BMW మోటార్‌బైక్‌ను నడుపుతుండగా ప్రమాదం జరిగింది. 38 ఏళ్ల బ్రెజిలియన్ బ్యూటీ తన మోటార్‌సైకిల్‌పై నియంత్రణ కోల్పోయి మిలాస్ సమీపంలో ట్రక్కును ఢీకొట్టింది. పారామెడిక్స్ వివరాల ప్రకారం..టాట్యాన సంఘటన స్థలంలో మరణించినట్లు తెలుస్తోంది. టాట్యానా ఓజోలినాతో పాటు ఉన్న స్థానిక టర్కిష్ బైకర్ అయిన ఒనూర్ ఒబుట్ ప్రమాదం నుండి బయటపడ్డాడు. కానీ తీవ్ర గాయాలతో ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలంలో ఉన్న మూడవ బైకర్ క్షేమంగా బయటపడ్డాడు.
ఓజోలినా చివరి సోషల్ మీడియా పోస్ట్ గ్రీక్-టర్కిష్ సరిహద్దు నుండి వచ్చిన ఒక వీడియో.. ఈ వీడియోలో రష్యాతో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా యూరోపియన్ యూనియన్ లో ప్రవేశించడానికి నిరాకరించడంపై ఆమె నిరాశను వ్యక్తం చేసింది. ఈ సమస్య ఎదురైనా కానీ టర్కీలో తన ప్రయాణాన్ని కొనసాగించాలని ఓజోలినా టాట్యానా పట్టుదలగా ఉన్నారు. మోటోమాస్కో అసోసియేషన్ అధిపతి ఆండ్రీ ఇవనోవ్ టాట్యానాకు నివాళులర్పిస్తూ, ``మోటోతాన్య ఇకపై మాతో లేరు. ఆమె నిరంతరం ఉత్సాహంగా స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడిపింది.. విజయం సాధించింది. లక్షలాది మంది మోటార్‌సైకిల్ ఫాలోవర్స్ తనను ఆరాధిస్తారు`` అని తెలిపారు. కిక్‌స్టార్టర్ ద్వారా 2023లో మోటోబ్లాగర్ ఆఫ్ ది ఇయర్‌గా, ట్రావెల్ బ్లాగర్ ఆఫ్ ది ఇయర్‌గా ఓజోలినా గౌరవం అందుకుంది. టాట్యానా చివరి సోషల్ మీడియా పోస్ట్ అభిమానుల హృదయాలను ద్రవింపజేస్తోంది.