బింబిసార 2 గొడవ.. ఈసారి మరింత క్లారిటీ..!
ఇక బింబిసార సెకండ్ ప్రాజెక్టును రొమాంటిక్ సినిమా దర్శకుడు అనిల్ పుడురి డైరెక్ట్ చేసే అవకాశం ఉందట
By: Tupaki Desk | 7 Aug 2023 9:24 AM GMTనందమూరి హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచినటువంటి చిత్రం బింబిసార. ఈ సినిమాతో అతను ఊహించని స్థాయిలో అయితే క్రేజ్ అందుకున్నాడు. ఇక ఆ సినిమాకు సీక్వెల్ కూడా వస్తుంది అని ఆ మధ్య క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక దర్శకుడు వశిష్ట కూడా సీక్వెల్ చేయాలని అనుకున్నాడు. కానీ అతను తన తదుపరి ప్రాజెక్టును మెగాస్టార్ తో అంతకుమించి అనేలా తెరపైకి తీసుకురావాలి అనే ఆలోచనతో ఉన్నాడు.
ఇక కళ్యాణ్ రామ్ ఐతే ఎట్టి పరిస్థితుల్లోనూ సీక్వెల్ ను వీలైనంత త్వరగా తీసుకురావాలని అనుకున్నాడు. ఎందుకంటే జి సంస్థ వీరికి ఏకంగా 100 కోట్ల ఆఫర్ ఇచ్చింది. మొత్తం సినిమా థియేట్రికల్, డిజిటల్ హక్కులను కూడా ఆ రేటుకు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పడంతో కళ్యాణ్ రామ్ వెంటనే మొదలు పెట్టాలని అనుకున్నాడు.
కానీ ఈ లోపు దర్శకుడు వశిష్ట మెగాస్టార్ తో సినిమా చేసేందుకు చర్చలు మొదలుపెట్టాడు. దీంతో వారిద్దరికీ మధ్యలో విభేదాలు వచ్చినట్లు అయితే టాక్ వచ్చింది. అయితే బింబిసార సినిమా విడుదలై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్ చేశాడు.
అందులో హీరో కళ్యాణ్ రామ్ పేరుతో పాటు సినిమాకు వర్క్ చేసిన అందరి పేర్లను మెన్షన్ చేసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
అయితే హీరో కళ్యాణ్ రామ్ మాత్రం సినిమా గురించి ప్రస్తావించలేదు. అంతేకాకుండా దర్శకుడు చేసిన పోస్ట్ పై కూడా అతను రియాక్ట్ కాలేదు. దీంతో వీరి మధ్యలో విభేదాలు తగ్గలేదు అని మరింత అనుమానాలను కలిగిస్తోంది.
ఇక బింబిసార సెకండ్ ప్రాజెక్టును రొమాంటిక్ సినిమా దర్శకుడు అనిల్ పుడురి డైరెక్ట్ చేసే అవకాశం ఉందట. ఈ దర్శకుడు ఇంతకుముందు బింబిసార సినిమాకు విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా కూడా వర్క్ చేశాడు.
కాబట్టి అతనిపై కళ్యాణ్ రామ్ కాస్త కాన్ఫిడెంట్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. జీ ఇచ్చిన ఆఫర్ తో సినిమాను ఒక 60 కోట్ల లోపు ఫినిష్ చేసి మిగతా 40 కోట్ల ప్రాఫిట్ ను అందుకోవాలని కళ్యాణ్ రామ్ అనుకున్నట్లు అయితే టాక్ వినిపించింది.
ఇక వశిష్ట కళ్యాణ్ రామ్ ఆర్ట్స్ లో అయితే మరో సినిమా తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే బింబిసార టైం లోనే అతను ఈ సంస్థలోనే మరొక సినిమా చేయాలి అనే ఒప్పందాన్నికి సంతకం చేశారు. ఇక ఇప్పుడు చిరంజీవి సినిమా మొదలుపెట్టాలి అంటే తప్పనిసరిగా ఒప్పంద విషయంలో ఏదో ఒకటి తేల్చులోవాల్సిన అవసరమైతే ఉంది.