Begin typing your search above and press return to search.

కూతురు గుండెలో 2 రంధ్రాలు.. బిపాసా క‌న్నీరు ఆగ‌లేదు ..!

By:  Tupaki Desk   |   6 Aug 2023 4:27 AM GMT
కూతురు గుండెలో 2 రంధ్రాలు.. బిపాసా క‌న్నీరు ఆగ‌లేదు ..!
X

సెలబ్రిటీల జీవితాలు చాలా జోష్ ఫుల్ గా ఉంటాయని.. విలాసవంతమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారని భావిస్తే త‌ప్పులో అడుగేసిన‌ట్టే. వారు కూడా కష్టాలను ఎదుర్కొంటారు. న‌టి బిపాసా బ‌సు జీవితం అందుకు అతీతం కాదు. బిపాసా బసు తన 3 నెలల కుమార్తె గుండెలో 2 రంధ్రాలు ఉన్నాయని తెలుసుకున్న తర్వాత క‌న్నీరుమున్నీర‌య్యారు. హృద‌య‌విదార‌క స‌న్నివేశ‌మ‌ది. కుమార్తె దేవి గుండెలో 2 రంధ్రాలు ఉన్నాయని తెలిసాక‌.. చిన్నారికి కేవలం 3 నెలల వయస్సులో వైద్యులు ఎలా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చిందో కూడా బిపాసా బసు షాకింగ్ విష‌యాన్ని బహిర్గతం చేసింది.

చిన్నారి దేవికి పుట్టుక‌తోనే గుండెకు రెండు రంధ్రాలు ఉండడంతో మూడు నెలలకే ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందని బిపాసా తాజా ఇంట‌ర్వ్యూలో షాకింగ్ విష‌యాన్ని బహిర్గతం చేసింది. భయంకరమైన క్షణాన్ని గుర్తుచేసుకుంటూ నేహా ధూపియాతో తన లైవ్ సెషన్‌లో బిపాసా క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. మా పాప గుండెలో రెండు రంధ్రాలతో పుట్టిందని నాకు బిడ్డ పుట్టిన మూడవ రోజున తెలిసింది. నేను దీన్ని ఎవ‌రికీ చెప్పుకోకూడదని అనుకున్నాను. కానీ ఈ ప్రయాణంలో నాకు సహాయం చేసిన తల్లులు చాలా మంది ఉన్నారని నేను భావిస్తున్నాను. కాబట్టి నేను ఈ సున్నిత‌మైన విష‌యాన్ని అంద‌రి కోసం చెబుతున్నాను.

``దేవికి అది క‌ష్టకాలం. చిన్నారికి నయం అవుతుందో లేదో తెలుసుకోవడానికి ప్ర‌తినెలా గుండెకు స్కాన్ చేయాల్సి ఉంటుంద‌ని వైద్యులు మాకు చెప్పారు. కానీ శ‌స్త్ర చికిత్స స‌మ‌స్యాత్మ‌కం. పెద్ద రంధ్రం.. సంశ‌యంగా ఉందని డాక్ట‌ర్లు చెప్పారు. కానీ శస్త్రచికిత్స త‌ప్ప‌నిస‌రి అని అన్నారు. బిడ్డకు మూడు సంవత్సరాల వయస్సులో శస్త్రచికిత్స ఉత్తమంగా చేయగ‌ల‌మ‌ని కానీ ఇప్పుడు మూడు నెల‌లు మాత్ర‌మేన‌ని వైద్యులు అన్నారు. కానీ చివ‌ర‌కు సర్జరీ కోసం వేచి ఉండి అంగీకరించామ‌``ని బిపాసా వెల్ల‌డించింది.

ఆ క్ష‌ణం చాలా భారంగా సంఘర్షణను ఎదుర్కొన్నాను. ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా బిడ్డను ఎలా ర‌క్షించ‌గ‌లరు? సహజంగా ఏదైనా జరిగితే..? న‌మ్మే మ‌న‌లాంటి వారికి అది స్వస్థత చేకూరుస్తుందని నా న‌మ్మ‌కం. పుట్టుక‌తోనే స‌మ‌స్య తెలిసింది. మొదటి నెల... రెండవ నెలలో ఆగి చూసాను. స‌ర్జ‌రీ జరగలేదు. మూడవ నెలలో ఇక ఆగ‌లేదు. బిడ్డ‌ స్కాన్ కోసం వెళ్ళాను. చక్కగా అన్ని పరిశోధనలు చేయించాం. సర్జన్లను కలిశాను.. ఆసుపత్రులకు వెళ్ళాను.. వైద్యులతో మాట్లాడాను అని తెలిపారు బిపాసా. నిజ జీవితంలో బిప్స్ ఒక సైనికురాలు. కుమార్తె దేవికి రాక్-సాలిడ్ మమ్ .. వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం.