కంగనతో బీజేపీ కి అంత ర్యాపో లేదా?
`ఎమర్జెన్సీ` రిలీజ్ విషయంలో కంగన రనౌత్ ఒంటరి పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 Sep 2024 11:30 AM GMT`ఎమర్జెన్సీ` రిలీజ్ విషయంలో కంగన రనౌత్ ఒంటరి పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నుంచి కంగనకి ఎలాంటి మద్దతు దక్కలేదు. ఒక్క వివేక్ అగ్ని హోత్రి తప్ప ఇంకెవ్వరూ స్పందించలేదు. సాధారణంగా ఓ సినిమా రిలీజ్ విషయంలో అభ్యంతరం వ్యక్తమైతే ఆ సినిమాలో నటులైనా మద్దతుగా మాట్లాడుతారు. కానీ ఎమర్జెన్సీ విషయంలో అదెక్కడా కనిపించలేదు. కంగన తప్ప ఇంకెవ్వరూ మీడియా ముందుకు రావడం లేదు.
ఈ సినిమాని తానే స్వీయా దర్శకత్వంలో నిర్మించింది. ఇంకా సినిమా చాలా పాత్రలు కీలకమైనవి ఉన్నాయి. అయినా వాళ్లెవ్వరూ ముందుకు రావడం లేదు. ఇక ఇండస్ట్రీ నుంచి కంగన అంటే గిట్టని వారంతో మంది ఉన్నారు. ఆమెపై గొంతెత్తి అరిచేవారే తప్ప! మద్దతు ప్రకటించే సీన్ లేదు. ఇది అంతా ముందే ఊహించిందే. ఆమె ఒంటెద్ది పోకడ విధానమే ఇలాంటి సన్నివేశంలో పడేసింది అన్నది వాస్తవం. అయితే కంగన నమ్మిన వాళ్లు సైతం మద్దతుగా రాకపోవడం ఆశ్చర్యంగానే ఉంది.
ఇటీవలే కంగనే బీజీపీ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అది. ప్రభుత్వం తలుచుకుంటే ఎమర్జెన్సీ రిలీజ్ అవ్వడం అన్నది చిటిక వేసినంత పని . కానీ ప్రభుత్వ పెద్దలు గానీ, ఆ పార్టీ ఇతర నాయకులు గానీ సినిమా విషయంలో వేలు పెట్టడం లేదు. సహజంగా కాంగ్రెస్ మీద బీజేపీ ఒంటికాలుపై లేచి పడుతుంది. దేశ అభివృద్దిలో ఆ పార్టీ పనితీరును ఎప్పటికప్పుడు ఎండగడుతుంది.
కానీ ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ విషయంలో మాత్రం ఎలాంటి ఆరోపణల జోలికి వెళ్లడం లేదు. సినిమా పరంగా ఎలాంటి విమర్శలకు దిగలేదు. ఈ తీరు చూస్తుంటే? కంగనని అసలు పార్టీ వాళ్లెవ్వరూ ఖాతరు చేస్తున్నట్లే కనిపించలేదు. వాస్తవానికి సినిమా వాళ్లతో ర్యాపో మెయింటెన్ చేయడం అన్నది రాజకీయ పార్టీల్లో కేవలం బీజేపీకి మాత్రమే చెల్లింది. మోదీ-షాలు హైదరాబాద్ కి వస్తే స్టార్ హీరోలతోనే భేటీలు నిర్వహిస్తుంటారు. బాలీవుడ్ సెలబ్రిటీలతోనూ అంతే క్లోజ్ గా మూవ్ అవుతుంటారు. కానీ కంగనతో మాత్రం ఆ ర్యాపో మెయింటెన్ చేయడం లేదు.