Begin typing your search above and press return to search.

`దేవ‌ర‌`లో బాబి డియోల్...దేవ‌ర-2 గురించి ఇలా!

దేవర` సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ సీన్స్ కూడా షూట్ చేసారంటున్నారు.

By:  Tupaki Desk   |   1 Oct 2024 11:30 AM GMT
`దేవ‌ర‌`లో బాబి డియోల్...దేవ‌ర-2 గురించి ఇలా!
X

ఇది `దేవ‌ర` క‌థ అంటూ? మొద‌లు పెట్టిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు బాక్సాపీస్ వ‌ద్ద దున్నేస్తోన్న సంగ‌తి తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల మోత మోగిస్తున్నాడు. మూడు రోజుల్లోనే 300 కోట్లకు పైగా గ్రాస్ తెచ్చింది. ఎన్టీఆర్ ఇమేజ్-కొర‌టాల బ్రాండ్ తో సాధ్య‌మైంది. ప్ర‌స్తుతానికి పోటీగా ఇంకే సినిమా కూడా లేదు కాబ‌ట్టి కొన్ని రోజుల పాటు దేవ‌ర‌కి థియేట‌ర్ల‌లో తిరిగి ఉండ‌దు.

డివైడ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఒక్క‌సారైనా చూసే ఆడియ‌న్స్ చాలా మంది ఉంటారు. వాళ్లంతా వ‌చ్చిన `దేవ‌ర`కి లాభాలే. ఇప్ప‌టికే సేఫ్ జోన్ లో ప‌డిపోయింది కాబ‌ట్టి! మ‌రే విష‌యం ఆలోచించాల్సిన ప‌నిలేదు. మేక‌ర్స్ లో ఆ ధీమా స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఇక దేవ‌ర -2 అని క్లైమాక్స్ లో చెప్పేసారు. అయితే సినిమా చూసిన ఆడియ‌న్స్ లో ఎన్నో సందేహాలున్నాయి. యతి ఎవరు? మురుగ ఎలా చనిపోయాడు? సముద్రం లో ఉన్న అస్థిపంజరాలు ఎవరివి? దేవరని అతను ఎందుకు చంపాడు? వర బతికే ఉంటాడా? ఇలా చాలా సందేహాలున్నాయి.

దేవ‌ర -2 ప్రీక్వెల్ అవుతుందా? సీక్వెల్ అవుతుందా? అని చాలా మంది మదిలో మెదులుతుంది. వీట‌న్నింటికి దేవ‌ర‌2 లోనే స‌మాధానాలు దొరుకుతాయి. అయితే `దేవ‌ర‌`లో న‌టించిన కొంత మంది న‌టీన‌టుల నుంచి కొన్ని కీల‌క విష‌యాలు లీక్ అవుతున్నాయి. భైరా( సైఫ్ అలీఖాన్) తాయ‌రు చేసిన ఆయుధాల్లో కొన్ని ఆయుధాల్ని యూట్యూబ‌ర్లు వెలికి తీసారు. వాళ్ల నుంచి అందుతోన్న లీకులు ఏంటి? అంటే.

`దేవర` సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ సీన్స్ కూడా షూట్ చేసారంటున్నారు. త‌మ‌తో పాటు బాబీ డియోల్ కాంబినేష‌న్ సీన్స్ ఉన్నాయ‌న్నారు. `క్లైమాక్స్ లో బాబీ డియోల్ ఎంట్రీ ఇచ్చి ఆ హైతో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తారేమో అనుకున్నాము. కానీ సినిమాలో బాబీ డియోల్ సీన్ లేదని ఆశ్చ‌ర్య పోయారు. వాళ్ల మాటలు నిజమైతే బాబిడియోల్ పాత్ర‌ని ఎడిట్ చేసి ఉండొచ్చు. దాన్ని తీసుకొచ్చి రెండవ పార్టులో చూపిస్తున్నారామో. అలా కాకపోతే నిడివి ఎక్కువైంద‌ని...రెండ‌వ పార్ట‌లో ప‌రిచ‌యంతో ముగింపు ఉంటుంద‌ని మ‌రికొంద‌రు అంచ‌నా వేస్తున్నారు.