ప్రముఖ నటుడి కన్నీళ్లకు సందీప్ వంగా కారణమా?
`యానిమల్` విజయం తర్వాత బాబి డియోల్ చాలా వేదికలపై ఎమోషనల్ అయ్యారు. సందీప్ వంగా ఇచ్చిన ఈ అవకాశం తన జీవితాన్ని మార్చిందని అంగీకరించారు.
By: Tupaki Desk | 11 Dec 2024 6:30 PM GMTఅవును.. బాబి డియోల్ కన్నీళ్లు పెట్టారు. దీనికి కారణం టాలీవుడ్ దర్శకుడు సందీప్ వంగా. అంతగా బాబి డియోల్ ఎమోషనల్ అయ్యారంటే కచ్ఛితంగా సందీప్ వంగా ఇచ్చిన గిఫ్ట్ కారణం. బ్లాక్ బస్టర్ `యానిమల్`లో అబ్రార్ పాత్రను బాబీకి ఆఫర్ చేయకపోతే అసలు ఈ కన్నీళ్లు ఉండేవి కావేమో!
`యానిమల్` విజయం తర్వాత బాబి డియోల్ చాలా వేదికలపై ఎమోషనల్ అయ్యారు. సందీప్ వంగా ఇచ్చిన ఈ అవకాశం తన జీవితాన్ని మార్చిందని అంగీకరించారు. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో బాబి డియోల్ తన కెరీర్ కష్టాల గురించి మాట్లాడుతూ బరస్ట్ అయ్యాడు. కెరీర్‌లో లీస్ట్ ఫేజ్ తనని మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులందరినీ తీవ్రంగా బాధకు గురి చేసిందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు బాబి.
యానిమల్ చిత్రంతో బాబి చాలా గ్యాప్ తర్వాత నటుడిగా రీఎంట్రీ ఇచ్చాడు. ఇది ఘనమైన పునరాగమనం. అబ్రార్ కేవలం అతిధి పాత్రలో నటించినా కానీ.. నెగటివ్ పాత్రలో నటనకు గొప్ప ప్రశంసలు అందుకున్నాడు. చిత్రకథానాయకుడు రణబీర్ కపూర్‌తో పాటు బాబీలోని కొత్త కోణాన్ని యానిమల్ ఆవిష్కరించింది. సందీప్ రెడ్డి వంగా ఇచ్చిన ఆఫర్ బాబీకి బిగ్ గేమ్ ఛేంజర్ గా మారింది.
యానిమల్ తర్వాత బాబి డియోల్ వరుసగా సౌత్ లో పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవలే సూర్య కంగువలోను విలన్ గా కనిపించాడు. తదుపరి బాలకృష్ణ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం `డాకు మహారాజ్`లో నటిస్తున్నాడు. బాలీవుడ్ లోను పలు భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకున్నాడు. తిరిగి తన కెరీర్‌లో పీక్‌లో ఉన్నాడు.
అయితే ఈ సమయంలో బాబి డియోల్ తన పాత కష్టాలను మళ్లీ గుర్తు చేసుకున్నాడు. తాజా ఈవెంట్లో ఆవేదన చెందాడు. ఇంతకుముందు కాఫీ విత్ కరణ్ షోలో సన్నీడియోల్- బాబి డియోల్ తమ కష్టాల కడలి గురించి ఓపెనయ్యారు. కెరీర్ చెత్త దశకు చింతించి మద్యానికి కూడా అలవాటుపడ్డానని బాబిడియోల్ ఈ షోలో అంగీకరించాడు. ఆ సమయంలో ప్రముఖ హీరో తనను రక్షించడానికి `రేస్ 3`లో అవకాశం కల్పించారని తెలిపారు. గదర్ 2తో బంపర్ హిట్ కొట్టిన సన్నిడియోల్ సైతం బాబి డియోల్ తరహాలోనే చాలా వేదికలపై ఎమోషనల్ అయ్యారు. అన్నదమ్ములు కష్టంలో ఉన్నప్పుడు ఒకరినొకరు ఓదార్చుకున్నామని తెలిపారు.