మైండ్ లో ఫిక్సై బ్లైండ్ గా వెళ్లిపోతున్నాడా!
'యానిమల్' తర్వాత తన జీవితమే మారిపోయిందని బాబి డియోల్ కన్నీళ్లు సైతం చెమర్చాడు.
By: Tupaki Desk | 20 Feb 2025 12:01 PM GMTఒకప్పుడు నటుడిగా ఓ వెలుగు వెలిగిన బాబి డియోల్ ఆ తర్వాత పాతాళానికి పడిపోవడం మళ్లీ 'యాని మల్' తో కంబ్యాక్ అవ్వడం తెలిసిందే. 'యానిమల్' తర్వాత తన జీవితమే మారిపోయిందని బాబి డియోల్ కన్నీళ్లు సైతం చెమర్చాడు. అందుకు కారకుడు అయిన సందీప్ రెడ్డికి తానెప్పుడు రుణబపడి ఉంటానని సైతం అన్నాడు. 'యానిమల్' తర్వాత హిందీ సహా తెలుగు పరిశ్రమలోనూ బిజీ అయిన సంగతి తెలిసిందే.
పారితోషికం కూడా అదే రేంజ్ లో అందుకుంటున్నాడు. అటు వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం 'ఆశ్రమ్' సీజన్ 3 పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. ఈనెల 27న రిలీజ్ అవుతుంది. ఈ సిరీస్ ప్రచారంలో భాగంగా బాబి డియోల్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఆవేంటో ఆయన మాటల్లోనే..' కొన్నిసార్లు నటులు తమ పర్సనాల్టీతో సంబంధం లేని పాత్రలు పోషించాల్సి వస్తుంది.
ఆశ్రమ్ వెబ్ సిరీస్ నాకో కొత్త ఇమేజ్ ని తీసుకొస్తుందని నమ్ముతున్నాను. ఈ క్రమంలో డిఫరెంట్ పాత్రలు వస్తున్నా అంగీకరిస్తున్నా. ఇకపై నాకు హీరో పాత్రలు ఇవ్వరని ముందే గ్రహించాను. అందుకే 'ఆశ్రమ్' లో నటిండానికి ధైర్యంగా ముందుకెళ్లాను. ఈ విషయం ఇప్పటి వరకూ ఎక్కడా చెప్పలేదు. షో రిలీజ్ తర్వాత మాట్లాడాలనుకున్నా. ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నా' అని అన్నారు.
ప్రస్తుతం బాబిడియోల్ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెట్ నుడిగా మారిపోయారు. ఇటీవలే 'డాకుమహారాజ్' లో విలన్ గా నటించాడు. ఆసినిమా విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ నటిస్తోన్న 'హరిహర వీరమల్లు' లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రభాస్ 'స్పిరిట్' లోనూ నటిస్తున్నాడు. కోలీవుడ్ లో తలపతి విజయ్ 69వ చిత్రంలోనూ బాబి డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు.