Begin typing your search above and press return to search.

డియోల్ వార‌సుడు అబ్రార్ 2.0ని చూసారా?

అవును.. అబ్రార్ త‌న వార‌సుడైన అబ్రార్ 2.0ని ప‌రిచ‌యం చేసాడు. డియోల్ కుటుంబం నుంచి న‌ట‌వార‌సుడు ఇత‌డు.

By:  Tupaki Desk   |   30 Aug 2024 6:30 AM GMT
డియోల్ వార‌సుడు అబ్రార్ 2.0ని చూసారా?
X

అవును.. అబ్రార్ త‌న వార‌సుడైన అబ్రార్ 2.0ని ప‌రిచ‌యం చేసాడు. డియోల్ కుటుంబం నుంచి న‌ట‌వార‌సుడు ఇత‌డు. యానిమ‌ల్ క్రేజ్ తో కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్ లో ఉన్న బాబి డియోల్ ఇక‌పై త‌న కుమారుడిని క‌థానాయ‌కుడిని చేసేందుకు చేయాల్సిన ప్ర‌య‌త్నాల‌న్నీ చేస్తున్నాడు. ఇంత‌కుముందు యానిమ‌ల్ ఈవెంట్లో, గ‌ద‌ర్ 2 ఈవెంట్‌లోను డియోల్ వార‌సుడు క‌నిపించాడు.

అదే స‌మ‌యంలో బాబీ డియోల్ తన పెద్ద‌ కుమారుడు ఆర్యమాన్ డియోల్ బాలీవుడ్ కెరీర్ గురించి చర్చించారు. మరో 3-4 సంవత్సరాలలో ఆర్య‌మాన్ పరిశ్రమలోకి ప్రవేశిస్తాడని చెప్పాడు. గ‌తంలో ప‌లుమార్లు ఆర్యమాన్‌తో క‌లిసి ఉన్న ఫోటోల‌ను బాబి షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అయ్యాయి. తండ్రీకొడుకుల ద్వయం డాషింగ్ ఫోజ్‌ల‌పై బోలెడంత చ‌ర్చ సాగింది. డియోల్ క‌వ‌ల‌లు బావున్నారంటూ కాంప్లిమెంట్లు వ‌చ్చాయి.

ఇటీవ‌ల మ‌రోసారి బాబీ డియోల్ తన కుమారుడు ఆర్యమాన్‌తో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేసాడు. హిందీ మీడియా స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్లు అందుకు సంబంధించిన వీడియోల‌ను వైర‌ల్ చేసారు. నిజానికి బాబి డియోల్ కి ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. అందులో పెద్ద కొడుకు ఆర్య‌మాన్ డియోల్ త్వ‌ర‌లో బాలీవుడ్ కి ప‌రిచ‌యం అవుతాడు. త‌న రెండో కుమారుడు ధ‌ర‌మ్ డియోల్ ప్ర‌స్తుతం అక‌డ‌మిక్ స్టడీస్ ని పూర్తి చేస్తున్నాడు. ఆర్య‌మాన్ ప్ర‌స్తుతం న‌ట‌శిక్ష‌ణ పొందుతున్నాడ‌ని కూడా తెలుస్తోంది.

తండ్రీ కొడుకుల ఫోటోలపై స్పందిస్తూ ఒక అభిమాని ఇలా రాశాడు. మీరిద్దరూ చాలా అందంగా ఉన్నారు అని రాసారు. వావ్వ్ (ఫైర్ ఎమోజీలు)... హ్యాండ్సమ్... లాట్స్ ఆఫ్ లవ్ సార్ అని మ‌రొక‌రు వ్యాఖ్యానించ‌గా, వాట్ ఎ డ్యూయో (ఫైర్ ఎమోజి) అని మ‌రో వ్య‌క్తి వ్యాఖ్యానించారు. ఓ అభిమాని వావ్... సూపర్బ్ అండ్ డాషింగ్ అని కూడా రాశాడు. ఒక వ్యక్తి బాబీ కుమారుడు ఆర్యమాన్ డియోల్ భ‌విష్య‌త్ సూపర్ స్టార్ అని కూడా రాశాడు.

గ‌త డిసెంబరులో ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబీ త‌న‌ కుమారులు ఆర్యమాన్ డియోల్ ధరమ్ డియోల్ సినిమాల్లోకి రావాలనే ఆలోచన గురించి మాట్లాడారు. గత సంవత్సరం ఆర్యమాన్ గదర్ 2 సక్సెస్ పార్టీలో అందరి దృష్టిని ఆకర్షించాడు. యానిమల్ ప్రమోషన్‌ల‌లోను వీడియోలలో బాబీతో ఆర్య‌మాన్ కనిపించాడు. అదే స‌మ‌యంలో తన కొడుకులు, భార్య తాన్యా డియోల్‌తో క‌లిసి బాబీ ఉన్న‌ప్ప‌టి వీడియోలు వైర‌ల్ అయ్యాయి.

బాబీ ఇండస్ట్రీలోకి రాకముందే తన పెద్ద కొడుక్కి శిక్షణ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిపాడు. అత‌డు కష్టపడి పనిచేయాలని కోరుకుంటున్నాడు. ``షో బిజినెస్ వంటి వ్యాపారం మ‌రొక‌టి లేదు.. నా కొడుకులు ఈ పరిశ్రమలోకి వస్తారు.. కానీ వారు ప్రస్తుతం చాలా చిన్నవారు.. ముఖ్యంగా నా పెద్ద కొడుకు వయస్సు కేవలం 22 సంవత్సరాలు. చిన్నవాడికి 19 సంవత్సరాలు. కాబట్టి మరొక 3-4 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు`` అని బాబీ తెలిపాడు.

నేను ఆర్యమాన్ శిక్షణ పొందాలని, నిజాయితీగా కష్టపడి పనిచేయాలని కోరుకుంటున్నాను. అతను NYU స్టెర్న్ నుండి పట్టభద్రుడయ్యాడు. ఆర్య‌మాన్ తన మనస్సును కేంద్రీక‌రించి నిజంగా కష్టపడి పనిచేసే ఒక పిల్లవాడు. నా పిల్ల‌లిద్దరూ విభిన్నమైన లక్షణాలను కలిగి ఉన్నారు అని బాబీ ఆనందంగా తెలిపాడు. బాబి డియోల్ ప్ర‌స్తుతం కంగువ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. టాలీవుడ్ లో నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాలోను కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ప‌లు సౌత్ సినిమాల‌కు సంత‌కాలు చేసి బిజీగా ఉన్నాడు.