ఆ ఇద్దరి మధ్యా సౌత్ లో పోటీ!
`యానిమల్` సక్సెస్ తర్వాత బాబి డియోల్ టాలీవుడ్ లో విలన్ గా బిజీ అయిన సంగతి తెలిసిందే. సూర్య పాన్ ఇండియా చిత్రం `కంగువ`లో ప్రతి నాయకుడిగా నటించాడు.
By: Tupaki Desk | 28 Feb 2025 3:00 PM IST`యానిమల్` సక్సెస్ తర్వాత బాబి డియోల్ టాలీవుడ్ లో విలన్ గా బిజీ అయిన సంగతి తెలిసిందే. సూర్య పాన్ ఇండియా చిత్రం `కంగువ`లో ప్రతి నాయకుడిగా నటించాడు. ఇటీవలే రిలీజ్ అయిన `డాకు మహారాజ్` లో విలన్ గా అలరించాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తోన్న `హరిహర వీరమల్లు` లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రభాస్ `స్పిరిట్` లోనూ నటిస్తున్నాడు.
తలపతి విజయ్ 69వ చిత్రం `జన నాయగన్` లోనూ బాబి డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. అటు బాలీవుడ్ లో `ఆల్పా` సహా కొన్ని చిత్రాలకు కమిట్ అయ్యాడు. ఒక్క `యానిమల్` సక్సెస్ తెచ్చిన అవకాశాలే ఇవన్నీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిర్మాతలకు కూడా పారితోషికం పరంగా అందు బాటులో ఉంటున్నాడు. ఈ కోణంలోనూ నిర్మాతలంతా బాబి డియోల్ తీసుకోవడానికి మరో ఆలోచన చేయడం లేదు.
అయితే సరిగ్గా ఇదే సమయంలో బాబి డియోల్ కి సంజయ్ దత్ పోటీగా మారాడు? అన్నది అంతే నిజం. `ఇస్మార్ట్ శంకర్` తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు దత్. అంతకు ముందే కన్నడ చిత్రం `కేజీఎఫ్`లో నటించారు. `కేడీ ది డెవిల్` లోనూ విలన్ గా నటిస్తున్నాడు. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న `రాజాసాబ్` లో ఖల్ నాయకే విలన్ . అలాగే గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తోన్న `అఖండ2` లోనూ దత్ విలన్ అనే ప్రచారం జోరుగా సాగుతుంది.
మెగా మేనల్లుడు సాయితేజ్ హీరోగా నటిస్తోన్న 'సంబరాల ఏటిగట్టు'లో కూడా సంజయ్ దత్ ని విలన్ గా తీసుకున్నట్లు సమాచారం. అయితే వీటిలో కొన్ని అవకాశాలు తొలుత బాబి డియోల్ కి వరించాటయ. కానీ హిందీ చిత్రం `ఆల్పా`తో ఓ సినిమా డేట్లు క్లాష్ అవ్వడంతో ఆ ఛాన్స్ మిస్ చేసుకోవాల్సి వచ్చిందని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. ఏది ఏమైనా సౌత్ అవకాశాల పరంగా సంజయ్ దత్-బాబి డియోల్ మధ్య పోటీ కనిపిస్తుంది.