Begin typing your search above and press return to search.

బాలయ్య షోలో ఎన్టీఆర్ టాపిక్.. క్లారిటీ ఇచ్చిన బాబీ..!

"షో మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది. ఆ గ్యాప్ లో ఏదో ఒక సినిమాలో ఫలానా క్యారక్టర్ లో మా తారక్ అయితే చాలా బాగుంటాడు అని బాలయ్య మాతో అన్నారు.

By:  Tupaki Desk   |   7 Jan 2025 4:29 PM GMT
బాలయ్య షోలో ఎన్టీఆర్ టాపిక్.. క్లారిటీ ఇచ్చిన బాబీ..!
X

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్' టాక్ షోలో జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ ను కావాలనే అవైడ్ చేస్తున్నారంటూ అభిమానులు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా బాలయ్య షోలో 'డాకు మహారాజ్' టీమ్ పాల్గొనగా.. బాబీ డైరెక్ట్ చేసిన 'జై ల‌వ‌కుశ‌' సినిమా ప్రస్తావన లేకుండా ఎడిట్ చేసి టెలీకాస్ట్ చేశారంటూ ప్రచారం జరిగింది. దీంతో బాగా హర్ట్ అయిన తారక్ ఫ్యాన్స్.. డాకు మూవీకి సపోర్ట్ చేయమంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో అన్‌స్టాపబుల్ షోలో అలాంటి డ్రామా ఏమీ జరగలేదని, తారక్ టాపిక్ ను ఎడిటింగ్ లో తీసేసారని వస్తున్న వార్తల్లో నిజం లేదని డైరెక్టర్ బాబీ తాజాగా వివరణ ఇచ్చారు.

'డాకు మహారాజ్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మంగళవారం సాయత్రం చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనికి డైరెక్టర్ బాబీ కొల్లి, నిర్మాత ఎస్. నాగవంశీ, హీరోయిన్లు శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 'అన్‌ స్టాపబుల్' షోలో ఎన్టీఆర్ పేరుని ప్రస్తావించవద్దని ముందే సూచనలు ఇచ్చారట. అది నిజమేనా?' అని బాబీని ప్రశ్నించగా.. "అసలు అక్కడ అంత డ్రామా జరగలేదు. దాన్ని కవర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ షోలో స్లైడ్ అయిన ఫోటోల గురించి బాలయ్య అడిగారు.. నేను దానికి సమాధానం చెప్పాను. అంతే జరిగింది" అని తెలిపారు.

"షో మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది. ఆ గ్యాప్ లో ఏదో ఒక సినిమాలో ఫలానా క్యారక్టర్ లో మా తారక్ అయితే చాలా బాగుంటాడు అని బాలయ్య మాతో అన్నారు. అది రికార్డెడ్ ప్రోగ్రామ్ కాకపోవడం వల్ల అది బయటకు రాలేదు. ఆయనకు 'జై లవకుశ' సినిమా చాలా బాగా ఇష్టం. దాని గురించి కూడా ఆయన నాతో రెండు మూడు సార్లు మాట్లాడాడు. కాబట్టి అలాంటివేం లేవు. పాపం.. మనమే అనవసరంగా ఒక చిన్న ఫ్యామిలీ ఇష్యూని పెద్దది చేస్తుంటాం అంతే" అని బాబీ అన్నారు.

అంతకముందు నాగవంశీ సైతం ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చెప్పారు. "నిజంగా సినిమా పేరు గుర్తు లేదు కానీ, ఒక క్యారక్టర్ ఎన్టీఆర్ చేస్తే చాలా బాగుంటుందని బాలకృష్ణ బ్రేక్ లో మాతో అన్నారు. లైవ్ లో కాదు. కానీ 'జై లవకుశ' టాపిక్ లేదు.. ఎక్కడా డిలీట్ చేయలేదు" అని చెప్పారు. అయితే దర్శక నిర్మాతలు ఇద్దరికీ బాలయ్య చెప్పిన ఆ సినిమా పేరేంటి, ఆ క్యారక్టర్ ఏంటి అనేది గుర్తు లేదని చెప్పడంపై తారక్ ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

బాబీ - నాగవంశీ చెప్పింది నిజమే అనుకున్నా.. అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకు లేదని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. బాబీ డైరెక్ట్ చేసిన హీరోలందరి ఫొటోలు వేసినప్పుడు.. దర్శకుడి కెరీర్ లో కీలకమైన 'జై లవకుశ' హీరో తారక్ ఫోటో ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తున్నారు. దీన్ని బట్టే కావాలనే ఎన్టీఆర్ గురించి, ఆయన సినిమాల గురించి షోలో చర్చకు రాకుండా చేస్తున్నారనేది అర్థం అవుతోందని అంటున్నారు. ఇదంతా బాలయ్యకు తెలియకుండా జరిగిందా?, దీనికి షో వెనకున్న 'ఆహా' టీమ్ కారణమా? అని క్వశ్చన్ చేస్తున్నారు.