Begin typing your search above and press return to search.

మోక్షజ్ఞతో సినిమా చేసే ఛాన్స్ వస్తే… బాబీ ఎం అన్నారంటే?

డాకు మహారాజ్ షూటింగ్ సమయంలో అతను మూడు, నాలుగు సార్లు లొకేషన్స్ కి వచ్చారు. ఆరు అడుగుల హైట్, పెర్ఫెక్ట్ లుక్ తో ఉంటాడు.

By:  Tupaki Desk   |   26 Dec 2024 11:06 AM GMT
మోక్షజ్ఞతో సినిమా చేసే ఛాన్స్ వస్తే… బాబీ ఎం అన్నారంటే?
X

నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అతని మొదటి సినిమా ఈపాటికే స్టార్ట్ కావాల్సింది. అయితే ఈ సినిమా ఆగిపోయిందని టాక్ వచ్చింది. ఇక అందులో ఎలాంటి వాస్తవం లేదని మేకర్స్ తేల్చేశారు. కచ్చితంగా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. అయితే మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది మాత్రం క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇక మోక్షజ్ఞతో సినిమాలు చేయడం కోసం చాలా మంది డైరెక్టర్స్ వెయిటింగ్ లో ఉన్నారనే టాక్ వస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో మోక్షజ్ఞ ఒక సినిమా చేస్తాడనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంటే బాలయ్యతో 'డాకు మహారాజ్' సినిమా చేసిన బాబీ మోక్షజ్ఞ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'డాకు మహారాజ్' మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యుట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబీ మోక్షజ్ఞ గురించి మాట్లాడారు. డాకు మహారాజ్ షూటింగ్ సమయంలో అతను మూడు, నాలుగు సార్లు లొకేషన్స్ కి వచ్చారు. ఆరు అడుగుల హైట్, పెర్ఫెక్ట్ లుక్ తో ఉంటాడు. షార్ప్ ఫీచర్స్ అతనిలో ఉన్నాయి. అందరి దగ్గర ఒదిగి ఉంటాడు. అలాగే నేర్చుకోవాలనే తపన ఎక్కువగా కనిపిస్తుంది.

అలాంటి కుర్రాడు దొరికితే కచ్చితంగా సినిమా చేయాలని ఉంటుంది. ఒక వేళ అతనితో మూవీ చేసే అవకాశం వస్తే మాత్రం వదులుకోను. మన పని చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు ఆ అవకాశం వస్తుందని బాబీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మోక్షజ్ఞ గురించి బాబీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అతని ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.

ముఖ్యంగా నందమూరి అభిమానులు అయితే మోక్షజ్ఞ మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ తర్వాత మరో పాన్ ఇండియా స్టార్ ని చూడబోతున్నాం అనే ఫీలింగ్ అందరిలో ఉంది. ఇదిలా ఉంటే బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన 'డాకు మహారాజ్' సినిమాపైన కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సంక్రాంతి ఫెస్టివల్ కానుకగా రాబోతున్న ఈ సినిమా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టడం గ్యారెంటీ అని అనుకుంటున్నారు. నిర్మాత నాగవంశీ కూడా ఈ చిత్రంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.