బోయపాటికి కాదు..నాకు నేనే పోటీ!
ఆయన చేతుల్లోనే డబుల్ హ్యాట్రిక్ కూడా సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
By: Tupaki Desk | 23 Dec 2024 6:55 AM GMTభారీ యాక్షన్ చిత్రాలు తీయడంలో బోయపాటి శ్రీను- బాబి స్పెషలిస్ట్ లు అని చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోలతో యాక్షన్ చిత్రాలు తీసి మెప్పించడంలో వారికి వారే సాటి. మేకింగ్ పరంగా ఎవరి ప్రత్యేకత వారికుంది. ఇప్పటి వరకూ బాలయ్యకు తిరుగులేని మూడు విజయాలు అందించారు బోయపాటి. 'అఖండ తావడం'తో నాల్గవ విజయాన్ని నమోదు చేయడానికి రెడీ అవుతున్నారు. ఆయన చేతుల్లోనే డబుల్ హ్యాట్రిక్ కూడా సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక బాబి కూడా సీనియర్ హీరోలకు తనదైన శైలి హిట్లు అందిస్తున్నారు. గత సినిమా మెగాస్టార్ చిరంజీవితో 'వాల్తేరు వీరయ్య' చేసి భారీ విజయాన్ని అందించారు. ఇప్పుడు 'డాకు మహారాజ్' తో బాలయ్యకు అంతకు మించి బ్లాక్ బాస్లర్ ఇవ్వాలని రెడీ అవుతున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోయపాటి సినిమాలకు పోటీగా డాకు మహారాజ్ ఉంటుందా? అన్న ప్రశ్న వ్యక్తమైంది.
దీనికి బాబి తాను ఎవరికి పోటీ కాదన్నారు. 'బోయపాటి విజయాల్ని, ఆయన- బాలకృష్ణ కాంబినేషన్ ని ప్రస్తా వించారు. మూడు విజయాలు అందించారు. అది గొప్ప కాంబినేషన్. ఆయనకు నేను ఎలా పోటీ అవుతాను. ఆయనకంటూ ఓ స్టైల్ ఉంది. నాకంటూ ఓస్టైల్ ఉంది. నేను ఎవరికీ పోటీ కాదు. ఎవరి సినిమాలు వారివి. కానీ గత సినిమాల కంటే బెటర్ గా తీయాలని మాత్రం ఎప్పుడూ అనుకుంటాను.
పాత సక్సెస్ ల్ని రీచెక్ చేసుకుని తదుపరి సినిమా ఎలా ఉండాలి? అన్నది తెలుసుకుని ముందుకెళ్తాను. ఇక్కడ అప్ డేట్ అవ్వడం అన్నది చాలా అవసరం' అని అన్నారు. అలాగే చిత్ర నిర్మాత నాగవంశీ కూడా 'జైలర్' సినిమా కంటే గొప్ప సినిమా తీయాలి అన్న ఆశని వ్యక్తం చేసారు. నెల్సన్ మేకింగ్ చూసి సినిమా ఇలా కూడా తీయోచ్చా? అన్న కొత్త ఐడియాని అందించార'న్నారు.