'పుష్ప-2 తర్వాత శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ కే హైయెస్ట్ వసూళ్లు!'
రీసెంట్ గా క, కమిటీ కుర్రోళ్ళు చిత్రాలతో విజయాలు అందుకున్న వంశీ నందిపాటి.. ఇప్పుడు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
By: Tupaki Desk | 24 Dec 2024 9:19 AM GMTటాలీవుడ్ ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ లో నటిస్తున్న మూవీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ సినిమాకు రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. ఆ మూవీతోనే ఆయన డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. తన లక్ ను డిసెంబర్ 25వ తేదీన టెస్ట్ చేసుకోనున్నారు.
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చిత్రంలో అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ ఫిమేల్ లీడ్ రోల్స్ పోషించగా.. లాస్య రెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్ పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్.. అన్నీ ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ అందుకున్నాయి. మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.
రీసెంట్ గా క, కమిటీ కుర్రోళ్ళు చిత్రాలతో విజయాలు అందుకున్న వంశీ నందిపాటి.. ఇప్పుడు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అయితే తాజాగా మేకర్స్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా.. దర్శకుడు బాబీ కొల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకను ఉద్దేశించి వేదికపై మాట్లాడారు.
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాతో తన బ్రదర్ రచయిత మోహన్ దర్శకుడిగా మారడం ఆనందంగా ఉందని బాబీ కొల్లి తెలిపారు. తామిద్దరం ఓ దర్శకుడు వద్ద పని చేశామని గుర్తు చేసుకున్నారు. మోహన్ ఎంత ప్రతిభావంతుడో తనకు తెలుసని అన్నారు. సినిమా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉందని తెలిపారు. మంచి కాన్సెప్ట్ తో మూవీ తీశారని కొనియాడారు.
ట్రైలర్ చూస్తుంటే సినిమాలో బాగా సస్పెన్స్ క్రియేట్ చేసినట్లు ఉన్నారని ప్రశంసించారు. మూవీ టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ తెలిపారు. అనంతరం నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడారు. సినిమాపై చాలా నమ్మకం ఉందని తెలిపారు. తన ఫోన్ నెంబర్ ఇచ్చి.. మూవీ చూశాక నచ్చకపోతే కాల్ చేయవచ్చని చెప్పారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి.
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ డిసెంబర్ నెలలో పుష్ప 2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధిస్తుందని అంచనా వేశారు వంశీ నందిపాటి. అలా జరగకపోయినా.. తాను ఇచ్చిన నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వవచ్చని తెలిపారు. మోహన్ పై తనకు నమ్మకం ఉందని చెప్పారు. ఇంత చిన్న బడ్జెట్ సినిమాలు ఎందుకు తెస్తున్నావని అడిగిన వారు.. ఇప్పుడు ప్రమోషన్స్ తర్వాత ప్రోత్సహించడం మొదలుపెట్టారని వెల్లడించారు.