Begin typing your search above and press return to search.

సంక్రాంతిలో చరణ్ - బాలయ్య ఫైట్.. బాబీ ఏమన్నారంటే..

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డాకు మహారాజ్’ టీజర్ ఫ్యాన్స్ కి గట్టిగానే ఎక్కుతోంది.

By:  Tupaki Desk   |   15 Nov 2024 9:42 AM GMT
సంక్రాంతిలో చరణ్ - బాలయ్య ఫైట్.. బాబీ ఏమన్నారంటే..
X

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డాకు మహారాజ్’ టీజర్ ఫ్యాన్స్ కి గట్టిగానే ఎక్కుతోంది. దర్శకుడు బాబీ కోల్లి బాలకృష్ణను నెవ్వర్ బిఫోర్ అనేలా పవర్ఫుల్ గా, స్టైలిష్‌గా చూపించడానికి కృషి చేశారు. టీజర్ చూస్తేనే సినిమాలో ఉన్న మాస్ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అభిమానుల నుండి ఈ టీజర్‌కు అద్భుత స్పందన లభించింది. ఇక మీడియా ఇంటరాక్షన్‌లో ‘డాకు మహారాజ్’ కు సంబంధించి దర్శకుడు బాబీ నిర్మాత నాగవంశీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ గురించి నాగవంశీ మాట్లాడుతూ, బాలకృష్ణ, బాబీ డియోల్ మధ్య వచ్చే సీన్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ కలిగించేలా ఉంటుందని చెప్పారు. ఇంటర్వెల్ బాంగ్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నాగ వంశీ వెల్లడించారు. ‘డాకు మహారాజ్’లో మొత్తం ఐదు ప్రధాన యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయని, ఇవి సినిమా హైలైట్‌గా నిలుస్తాయని ఆయన అన్నారు.

బాబీ మాట్లాడుతూ.. పూర్తి స్థాయిలో సరికొత్తగా బాలయ్యను చూడబోతున్నారు. పర్ఫెక్ట్ మాస్‌ సినిమా ఇది. ఊహించని లెవెల్లో ఉంటుంది. ఇక మ్యూజిక్‌ చూస్తే.. స్పీకర్స్‌ ఓనర్స్‌ నా మీద, తమన్‌ మీద కేసు వేస్తారేమో అనిపిస్తుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ స్వయంగా అన్ని యాక్షన్ సన్నివేశాలు చేయడం విశేషం. ‘‘టీజర్‌లో చూపించిన యాక్షన్‌లో ఎక్కడా డూప్ లేదు. గుర్రంపై స్వయంగా బాలయ్య ఎక్కి యుద్ధ సన్నివేశాలు చేశారు,’’ అని దర్శకుడు బాబీ తెలిపారు.

అర్ధరాత్రి 2 గంటలకు జరిగిన షూటింగ్‌లో కూడా ఆయన గుర్రంపై స్వయంగా ఎక్కి, చేతిలో కాగడా పట్టుకుని నటించడం సినిమా స్థాయిని మరో పది అడుగులు పెంచింది. ప్రతీ విజువల్ హై లెవెల్‌లో ఉండేందుకు కృషి చేశాం. అంతేకాదు, ఈ సినిమాకు బాలయ్య గారి అభిమానుల అంచనాలను మించి అందించగలమని ఆశిస్తున్నాం.. అని బాబీ అన్నారు.

సంక్రాంతికి బాలయ్యతో పాటు రామ్ చరణ్ చిత్రం పోటీలో ఉంది. ఈ విషయం గురించి బాబీ స్పందిస్తూ, ‘‘గతేడాది సంక్రాంతికి చిరంజీవి సినిమాతో వచ్చాను. ఇప్పుడు బాలయ్య సినిమాతో వస్తున్నాను. ప్రతీ సినిమా న్యాయంగా, ధర్మంగా తెరకెక్కిస్తే విజయం సాధించవచ్చు. సంక్రాంతి సందర్బంగా అన్ని సినిమాలు హిట్టవ్వాలని కోరుకుంటున్నాను.

ఇక ‘‘బాలకృష్ణ గారు సెట్స్‌లో చిన్నపిల్లాడిలా ఉంటారు. ఏది చెబితే అది చేస్తారు. ఆయనతో పని చేయడం ప్రతి దర్శకుడికి గౌరవంగా ఉంటుంది. ఈ సినిమా గురించి ఇంకా చెప్పేందుకు చాలా అంశాలు ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని వివరాలు పంచుకుంటాం,’’ అని బాబీ తెలిపారు. ఇక పుష్ప గురించి స్పందించిన థమన్ అందులో నేను కేవలం ఒక భాగం మాత్రమే అని దానికీ చాలామంది వర్క్ చేస్తున్నట్లు తెలిపారు. ఒక సినిమాకి ఎంతవరకు వర్క్ చేయాలో నాకు ఇచ్చిన బాధ్యత వరకు ఆ పని పూర్తి చేశానని అన్నారు.