బాబీ ఇప్పుడు జాగ్రత్త పడాల్సిందే..!
రైటర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ క్రేజ్ తో పవర్ సినిమాతో డైరెక్టర్ గా మారాడు కె.ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ.
By: Tupaki Desk | 20 Jan 2025 8:30 PM GMTరైటర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ క్రేజ్ తో పవర్ సినిమాతో డైరెక్టర్ గా మారాడు కె.ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ. ఆయన సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనిపించుకునేలా చేస్తూ వచ్చాడు. పవన్ కళ్యాణ్, ఎన్ టీ ఆర్, చిరంజీవితో సినిమాలు చేసిన బాబీ లేటెస్ట్ గా డాకు మహారాజ్ తో బాలయ్యకు ఒక సూపర్ హిట్ ఇచ్చేశాడు. బాలకృష్ణని డిఫరెంట్ గా చూపించాడన్న టాక్ తో బాబీ తో సినిమా చేసేందుకు స్టార్స్ ఆసక్తిగా ఉన్నారు.
కె ఎస్ బాబీ ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరాడు. డాకు మహారాజ్ టేకింగ్ తో తన మార్క్ ఇది అని సెట్ చేసిన బాబీ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడా అన్న ఎగ్జైట్ మెంట్ మొదలైంది. బాబీ అసలైతే సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా ప్లాన్ చేశాడు. ఆ మధ్య కథా చర్చలు జరుగుతున్నాయని టాక్ వచ్చింది. ఐతే బాబీ కి ఇప్పుడు రజిని ఓకే చెబుతాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
మరోపక్క బాబీ మెగాస్టార్ చిరంజీవితో కూడా ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఐతే చిరు ప్రస్తుతం విశ్వంభర చేస్తుండగా నెక్స్ట్ అనిల్ రావిపూడితో సినిమా ప్లానింగ్ లో ఉంది. ఈ సినిమాలు పూర్తి చేశాకే బాబీకి ఛాన్స్ ఇస్తాడు. ఈలోగా బాబీ మరో హీరోతో చేద్దామన్నా సరే ఎవరు కూడా ఖాళీగా లేరు. మరి బాబీ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఐతే డాకు మహారాజ్ తో తన రేంజ్ పెంచుకున్న బాబీ ఈసారి నెక్స్ట్ సినిమా తీస్తే పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పొచ్చు.
ఐతే స్టార్ సినిమా వచ్చినా సరే ఈ టైం లోనే గురి తప్పకుండా సినిమా చేయాలి. ఇప్పటివరకు బాబీ చేసిన సినిమాల్లో తన మార్క్ మిస్ అవ్వలేదు. ఐతే ఈ ఫాం కొనసాగించాలంటే బాబీ ఇప్పటి నుంచి మరింత జాగ్రత్త పడాల్సిందే అని చెప్పొచ్చు. బాబీ నెక్స్ట్ సినిమా అనౌన్స్ మెంట్ కోసం మాస్ ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.