Begin typing your search above and press return to search.

యానిమల్‌ స్టార్ కెరీర్ పాఠాలు వైరల్‌..!

బాలీవుడ్ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్‌ లో విలన్ గా నటించడం ద్వారా పాన్ ఇండియా స్టార్‌ డమ్‌ దక్కించుకున్న నటుడు బాబీ డియోల్‌

By:  Tupaki Desk   |   18 Jun 2024 1:10 PM GMT
యానిమల్‌ స్టార్ కెరీర్ పాఠాలు వైరల్‌..!
X

బాలీవుడ్ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్‌ లో విలన్ గా నటించడం ద్వారా పాన్ ఇండియా స్టార్‌ డమ్‌ దక్కించుకున్న నటుడు బాబీ డియోల్‌. యానిమల్‌ సినిమా తర్వాత ఒక్కసారిగా బాబీ డియోల్‌ బిజీ అయ్యాడు. తెలుగు లో బాలయ్య తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.

తమిళ మరియు హిందీ భాష సినిమాల్లో కూడా బాబీ డియోల్‌ నటిస్తున్నాడు. గతంలో హీరోగా బ్లాక్ బస్టర్ లను అందించిన బాబీ డియోల్‌ ఇప్పుడు విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఆ మధ్య బాబీ డియోల్‌ పూర్తిగా ఫేడ్‌ ఔట్‌ అయ్యాడు. ఇక ఆయన సినిమాలు రావనుకున్న సమయంలో అనూహ్యంగా రీ ఎంట్రీ ఇచ్చాడు. రీ ఎంట్రీతో బాబీ డియోల్‌ సత్తా చాటుతున్నాడు. తాజాగా ఒక జాతీయ మీడియా సంస్థతో బాబీ డియోల్‌ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించి వైరల్‌ అయ్యాయి.

బాబీ డియోల్‌ మాట్లాడుతూ... సినిమాల ఎంపిక విషయంలో అప్రమత్తంగా ఉండకుంటే అందరూ సలహాలిస్తూ ఉంటారు. అందులో ఏ ఒక్క సలహా తీసుకున్నా కూడా చాలా నష్టం జరుగుతుంది. సొంతంగా ఆలోచించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. సినిమాల ఎంపిక విషయంలో కొన్ని సార్లు సరైన నిర్ణయాలను తీసుకోలేక పోవచ్చు. కొన్ని సార్లు దర్శక నిర్మాతల వల్ల మోస పోవచ్చు.

ఛాలెంజింగ్‌ రోల్స్ గురించి భయపడినప్పుడు అలాంటి తప్పుడు నిర్ణయాలను తీసుకుంటూ ఉంటాం. ఇంతకు ముందు కంఫర్ట్‌ జోన్‌ లో ఉండి సినిమాలను ఎంపిక చేసుకునేవాడిని. కానీ ఇప్పుడు ఆ కంఫర్ట్‌ జోన్‌ అనేది లేకుండా చూసుకుంటున్నాను. ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను, అంతే కానీ భయపడను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

సినిమా ఇండస్ట్రీలో వచ్చే మార్పులను గమనిస్తూ మనం సినిమాలు చేయాల్సి ఉంటుంది, అందుకు తగ్గట్లుగా పాత్రలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాదని ఇష్టానుసారంగా సినిమాలకు కమిట్‌ అయితే మాత్రం ఖచ్చితంగా నష్టం జరుగుతుందని బాబీ డియోల్‌ పేర్కొన్నాడు.