Begin typing your search above and press return to search.

ఆ సీన్లు లేక‌పోతే ఇంత పెద్ద హిట్ట‌య్యేది కాదు!

సోష‌ల్ మీడియాల్లో దీనిపై తీవ్రంగా చ‌ర్చ సాగుతోంది. పెళ్లాడి వ‌ధువును పెళ్లి రోజే అత్యాచారం చేసే స‌న్నివేశాన్ని సందీప్ వంగా తెర‌పై చూపించ‌డాన్ని కొంద‌రు డైజెస్ట్ చేసుకోలేదు ఇప్ప‌టికీ.

By:  Tupaki Desk   |   13 Dec 2023 4:27 PM GMT
ఆ సీన్లు లేక‌పోతే ఇంత పెద్ద హిట్ట‌య్యేది కాదు!
X

ర‌ణ‌బీర్ క‌పూర్ న‌టించిన యానిమ‌ల్ ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో ఒక‌టిగా నిలిచింది. ఈ సినిమా 1000 కోట్ల గ్రాస్ క్ల‌బ్ వైపు ప‌రుగులు పెడుతోంది. అయితే ఈ చిత్రంలోని హింస‌, ర‌క్త‌పాతం, అత్యాచార స‌న్నివేశాలు, క్రూర‌త్వంపై చాలా విమ‌ర్శ‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా అబ్రార్ (బాబి డియోల్) పాత్ర వైవాహిక అత్యాచార సన్నివేశంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. సోష‌ల్ మీడియాల్లో దీనిపై తీవ్రంగా చ‌ర్చ సాగుతోంది. పెళ్లాడి వ‌ధువును పెళ్లి రోజే అత్యాచారం చేసే స‌న్నివేశాన్ని సందీప్ వంగా తెర‌పై చూపించ‌డాన్ని కొంద‌రు డైజెస్ట్ చేసుకోలేదు ఇప్ప‌టికీ.

అయితే ఈ స‌న్నివేశాన్ని బాబీ డియోల్ స‌మ‌ర్థించారు. తాను ఆ సీన్ చేయ‌క‌పోయి ఉంటే సినిమా ఇంత పెద్ద‌ హిట్ట‌య్యేది కాదు అని అన్నాడు. త‌క్కువ స‌మ‌యంలో విల‌న్ పాత్ర‌ను ఎస్టాబ్లిష్ చేయ‌డానికి ఆ సీన్ త‌ప్ప‌లేద‌ని అన్నారు. అలాగే తాను సినిమా సమీక్షలను చదవనని.. వాటిని 'శక్తి వృధా'గా పరిగణిస్తానని బాబీ డియోల్ చెప్పాడు. యానిమల్‌లోని తన పాత్ర అబ్రార్ గురించి మాట్లాడుతూ, ఈ చిత్రం సమాజాన్ని ప్రతిబింబిస్తుందని.. సినిమాల‌తో తాను ప్రభావితం కానని చెప్పాడు.

రణబీర్ కపూర్ నటించిన యానిమ‌ల్ లో తన చిన్న పాత్రతో బాబీ డియోల్ కొత్తగా ప్రజాదరణ పొందాడు. విషపూరితమైన మగతనాన్ని తెర‌పై చూపిన‌ సందీప్ రెడ్డి వంగా ఇందులో విల‌న్ పాత్ర‌ను తీర్చిదిద్దిన తీరుపై కొన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా ఆ పాత్ర తెర‌పై అద్భుతంగా పండింద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన ఒక సన్నివేశంలో అబ్రార్ తన సోదరుడి మరణ వార్తను త‌న‌కు తెలిపిన వ్యక్తిని దారుణంగా చంపిన తర్వాత వివాహ వేదిక వద్ద తన కొత్త వధువు అయిన‌ మూడవ భార్యపై బలవంతంగా అత్యాచారం చేస్తాడు. తరువాత అతడు తన భార్యలిద్దరిపై దాడి చేసి తనతో ప‌డుకోవాల‌ని బలవంతం చేస్తాడు.

బాబీ ది తాజా మీడియా ఇంటర్వ్యూలో వైవాహిక అత్యాచార స‌న్నివేశంపై స్పందించాడు. తాను దేనినీ ప్రచారం చేయడం లేదని, అయితే ఆ పాత్ర‌ధారి క్రూరత్వంలో లోతును ప్రదర్శించడానికి ఈ సన్నివేశం అవసరం అని చెప్పాడు. "అవును.. కావలసింది. ఇంత తక్కువ వ్యవధిలో విల‌న్ పాత్ర‌ను ఎలా ప్రదర్శిస్తారు? ఈ మనిషి సామర్థ్యం ఏమిటో, అతను ఎలాంటి వ్యక్తి అనేది చూపించాలంటే ఈ సన్నివేశాలన్నీ అవసరం" అని చెప్పాడు.

బాబీ డియోల్ మాట్లాడుతూ.. ఫిలింమేక‌ర్స్ కథలను రూపొందించడానికి సమాజం ద్వారా ప్రభావితమవుతారని కూడా అన్నారు. ఇలాంటి సన్నివేశాలు జనాలను ప్రభావితం చేస్తాయని మీరు అనుకుంటున్నారా? అని అడిగినప్పుడు.. బాబీ మాట్లాడుతూ, తాను వ్యతిరేక దిశ‌ను విశ్వసిస్తానని మేక‌ర్స్ కథలను రూపొందించడానికి సమాజంలో ఏం జరుగుతుందో చూస్తార‌ని, అది ర‌చ‌యిత‌ల‌ను ప్రభావితం చేస్తుంద‌ని చెప్పాడు.

సమాజంలో జరిగేవాటిని మనం సినిమా మేక‌ర్స్ గా తీసుకుంటున్నాం. ఇవ‌న్నీ మన సమాజంలో ఉన్నాయి. మేము దానిని ప్రోత్సహించడం లేదు. మేము నటుల‌ము మాత్ర‌మే. పాత్రల్లో న‌టిస్తున్నాము. పాత్ర‌లు ప్రజలను అలరిస్తాయి. ఆ సీన్ లు చేయ‌క‌పోయి ఉంటే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యేది కాదు అని డియోల్ జస్టిఫై చేసాడు.

90ల నాటి పాపుల‌ర్ నటుడు అయిన బాబి డియోల్ కెరీర్ కి చాలా గ్యాప్ త‌ర్వాత‌ యానిమ‌ల్ పెద్ద బ్రేకింగ్ పాయింట్. ఇటీవ‌ల‌ తన వెబ్ సిరీస్ 'ఆశ్రమ్'తో మెప్పించాడు. ఈ సిరీస్ లో తన పాత్ర కూడా అంతే సమస్యాత్మకమైనదని, అయితే సిరీస్ విజయవంతమైందని డియోల్ చెప్పాడు. సినిమాల ప్రభావం త‌న‌పై ఎలా ఉండదో కూడా బాబీ హైలైట్ చేశాడు. నేను సినిమాతో ప్రభావితం కాను... యానిమ‌ల్ లో చూపిన క్రూరత్వాన్ని నిజ జీవితంలో కూడా తాను వ్యక్తిగతంగా చూశానని చెప్పాడు. బాబీ తన సినిమాను సమర్థిస్తూ.. మ‌నం నివసించే ప్రపంచంలో ఇలాంటి క్రూరత్వం ఉంద‌ని యానిమ‌ల్ అవగాహన కల్పిస్తోందని అన్నారు. ఈ చిత్రంలో ముగ్గురు భార్యలను కలిగి ఉన్నందుకు తన పాత్ర చాలా 'రొమాంటిక్' అని కూడా బాబిడియోల్ వ్యాఖ్యానించారు.