బాబి -2 బర్త్ డేకి ప్రియుడితో చిలౌట్ అలా!
ఈ నేపథ్యంలోనే అమ్మడు వ్యాపార వేత్త సామ్ మర్చంట్ తో డీప్ లవ్ లోనూ తేలుతున్నట్లు కొన్నిరోజులుగా ప్రచారం సాగుతోంది.
By: Tupaki Desk | 24 Feb 2024 6:15 AM GMTబాబి-2గా ఫేమస్ అయిన బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రి గురించి పరిచయం అవసరంలేదు. అమ్మడు 'యానిమల్' సినిమాతో ఏ రేంజ్లో ఫేమస్ అయిందో తెలిసిందే. తెరపై కనిపించినంత సేపు మెరుపులా మురిపించేసి వెళ్లిపోయింది. దీంతో అమ్మడికి ఇప్పుడు అవకాశాలు అలాగే వరిస్తున్నాయి. బాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ డిమ్రీకి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమ్మడు వ్యాపార వేత్త సామ్ మర్చంట్ తో డీప్ లవ్ లోనూ తేలుతున్నట్లు కొన్నిరోజులుగా ప్రచారం సాగుతోంది.
కానీ ఇందులో వాస్తవం ఏంటో క్లారిటీ లేదు. సరిగ్గా ఇదే సమయంలో అమ్మడు ప్రియుడు బర్త్ డేకి స్పెషల్ గా విషెస్ చెప్పి సైలెంట్ అయింది. అతడితో దిగిన రెండు ఫోటోల్ని ప్రేమ పూర్వకంగా పోస్ట్ చేసింది. దీంతో ఇద్దరి రిలేషన్ షిప్ పై మరోసారి బాలీవుడ్ లో మీడియాలో వాడి వేడి చర్చ సాగింది. తాజాగా ఈసారి వంతు తృప్తిది అయింది. ఫిబ్రవరి 23న ఆమె పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులంతా విషెస్ తెలియజేసారు. సరిగ్గా ఇదే సమయంలో ప్రియుడు కూడా అందరిలాగే లైన్ లోకి విష్ చేసాడు.
ఆమెతో పాటు దిగిన ఓ సెల్పీని కూడా పోస్ట్ చేసాడు. నా ప్రియమైన తృప్తికి శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చాడు` దీంతో ఇద్దరి మధ్య లవ్ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనడానికి మరో బలమైన ఆధారం దొరికినట్లు అయింది. ఇద్దరి మధ్య సీరియస్ రిలేషన్ షిప్ నడుస్తుందని తాజాగా మరోసారి కన్పర్మేషన్ దొరికినట్లు అయింది. ప్రస్తుతం ఇద్దరి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరీ సామ్ మర్చంట్ అంటే? అతడు రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ బిజినెస్ మ్యాన్ అని తెలుస్తోంది.
విలాసవంతమైన విఐపీ భవనాలు.. గోవా లో రెస్టారెంట్లు పబ్ లు..క్లబ్ లు ఉన్నాయి. సామ్ మర్చంట్ ఈ వ్యాపారకంటే ముందుగా మోడల్‌గా పనిచేశాడు. అతను ట్రావెల్ బ్లాగర్ కూడా. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. అయితే తృప్తి ఖాతాలో ఇతను సెకెండ్ బోయ్ ప్రెండ్. అమ్మడు సామ్ మర్చంట్ కంటే ముందు బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ సోదరుడు కర్నేష్ శర్మతో కొన్నాళ్లు డేటింగ్ చేసింది.