అలాంటి పనులు చేయనని ముఖం మీదే చెప్పేసా!
సినిమా హీరోయిన్ల దగ్గర నుంచి టీవీ ఆర్టిస్టుల వరకూ అంతా తమ అనుభవాలు పంచుకున్నారు.
By: Tupaki Desk | 6 Oct 2024 1:30 AM GMTబాలీవుడ్ లో ఇప్పటికే ఎంతో మంది నటీమణులు కాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. ఇండస్ట్రీలో తమకెదురైన అనుభవాలు వివిధ మాధ్యమాల ద్వారా బయట పెట్టారు. సినిమా హీరోయిన్ల దగ్గర నుంచి టీవీ ఆర్టిస్టుల వరకూ అంతా తమ అనుభవాలు పంచుకున్నారు. తాజాగా మరో బాలీవుడ్ నటి ఆశానేగి ఆమె అనుభవాన్ని చెప్పుకొచ్చింది. 'అప్పట్లో కోఆర్డినేటర్లు ఉండేవారు. అవకాశాలుంటే వీళ్ల ద్వారానే తెలిసేది.
ఈ క్రమంలోనే నాకో వ్యక్తి పరిచమయ్యాడు. అతడితో ఓ మీటింగ్ కూడా అయింది. అప్పుడు నా వయసు 20 ఏళ్లు. టెలివిజన్ అంటే ఇలా ఉంటుంది. ఇక్కడ కొన్ని విషయాలకు నో చెప్పకుండా ఎస్ అనాలి. అప్పుడే అవకాశాలొస్తాయి. ఎదగడానికి అవకాశం ఉంటుందన్నాడు. ఎదిగిన వాళ్లంతా అలా పైకి వెళ్లిన వారే అని చెప్పాడు. అప్పుడే అతడి మనసులో దురుద్దేశం అర్దమైంది. దీంతో నాకు ఈ కెరీర్ వద్దు అని చెప్పాడు.
నాకు ఎంత మాత్రం ఆసక్తి లేదని ముఖం మీదనే చెప్పాను. తర్వాత ఈవిషయాన్ని నా స్నేహితురాలితో చెప్పాను. తను కూడా సింపుల్ గా లైట్ తీసుకుంది' అని తెలిపింది. ఆశానేగి టీవీ సీరియల్స్ ద్వారా ఎంతో ఫేమస్. ఎన్నో సీరియళ్లు చేసింది. బాలీవుడ్ కి `లూడో` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత `కాలర్ బాంబ్` అనే మరో సినిమాలో నటించింది. ఈ రెండంటి తర్వాత అవకాశాలు రాలేదు.
దీంతో టీవీ సీరియల్స్ కి బధులుగా వెబ్ సిరీస్ లు మొదలు పెట్టింది. ప్రస్తుతం వాటితోనే బిజీగా ఉంది. ఇండస్ట్రీలో దాదాపు 14 ఏళ్లగా ఉంటుంది. `సప్నోన్ సే భరే నైనా` లో అమ్మడు మధుర అనే పాత్రతో టీవీ సీరియళ్లకు ఎంట్రీ ఇచ్చింది. `బారీష్` సీజన్ 2 తో వెబ్ సిరీస్ లు మొదలు పెట్టింది.