బాలీవుడ్ స్టార్.. సౌత్ లో గట్టిగానే..
అలాగే సంజయ్ దత్ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ తో విలన్ గా సౌత్ ఎంట్రీ ఇచ్చేశారు. సైఫ్ అలీఖాన్ ‘దేవర’ మూవీతో అందరిని ఆకట్టుకున్నారు.
By: Tupaki Desk | 27 Oct 2024 4:53 AM GMTఈ మధ్యకాలంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ కి సౌత్ లో డిమాండ్ విపరీతంగా పెరిగింది. అమితాబ్ బచ్చన్ ‘సైరా నరసింహారెడ్డి’ మూవీతో సౌత్ లో జర్నీ స్టార్ట్ చేశారు. ‘కల్కి’ మూవీలో అశ్వద్ధామగా పవర్ ఫుల్ రోల్ లో నటించి మెప్పించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వేట్టయన్’ మూవీలో లాయర్ గా నటించారు. అలాగే సంజయ్ దత్ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ తో విలన్ గా సౌత్ ఎంట్రీ ఇచ్చేశారు. సైఫ్ అలీఖాన్ ‘దేవర’ మూవీతో అందరిని ఆకట్టుకున్నారు.
‘స్పిరిట్’ మూవీ కోసం అతని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే ఒకప్పటి హీరో బాబీ డియోల్ కూడా సౌత్ లో బిజీ యాక్టర్ గా మారిపోయాడు. సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ మూవీలో బాబీ డియోల్ విలన్ గా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. ‘యానిమల్’ హిందీ మూవీ అయిన కూడా సౌత్ లో సూపర్ సక్సెస్ అయ్యింది. ‘యానిమల్’ లో బాబీ డియోల్ క్యారెక్టర్ కి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు.
ఈ మూవీ తర్వాత తెలుగు, తమిళ్ భాషలలో వరుస సినిమాలు ఒప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా చేస్తున్నారు. అలాగే నందమూరి నటసింహం బాలయ్య ‘NBK109’ మూవీలో కూడా బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటించారు. కోలీవుడ్ లో సూర్య పాన్ వరల్డ్ మూవీ ‘కంగువా’ లో స్ట్రాంగ్ విలన్ గా కనిపించబోతున్నారు. అలాగే దళపతి విజయ్ 69 చిత్రంలో కూడా అతనే విలన్.
ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాబీ డియోల్ ఒక్కో మూవీకి 6 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఆయనకున్న డిమాండ్, హిందీ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని మేకర్స్ భారీ మొత్తం ఇవ్వడానికి ముందుకొస్తున్నారని టాక్. విలన్ గా చేస్తోన్న సంజయ్ దత్ కూడా 8 నుంచి 10 కోట్ల మధ్యలోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అతని తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ ని బాబీ డియోల్ అందుకుంటున్నారు.
పాన్ ఇండియా కల్చర్ సౌత్ లో పెరగడంతో హిందీ బెల్ట్ లో ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేయడానికి అక్కడి నటులని కీలక పాత్రల కోసం ఎంపిక చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో ఒకప్పటి హీరోలకి సౌత్ లో విపరీతంగా డిమాండ్ పెరిగింది. భారీ బడ్జెట్ లతో మూవీస్ చేస్తోన్న నేపథ్యంలో వారు అడిగినంత రెమ్యునరేషన్ లు ఇవ్వడానికి మేకర్స్ సిద్ధం అవుతున్నారు.