Begin typing your search above and press return to search.

హీరోయిన్ చెల్లి బికినీ డోస్.. అదే రేంజ్ లో..

నేహా శర్మ ఇప్పుడు తెలుగులో పెద్దగా కనిపించకపోయినా ఆమెను తెలుగు జనాలు అంత ఈజీగా మర్చిపోరు.

By:  Tupaki Desk   |   19 Sep 2024 4:30 PM GMT
హీరోయిన్ చెల్లి బికినీ డోస్.. అదే రేంజ్ లో..
X

నేహా శర్మ ఇప్పుడు తెలుగులో పెద్దగా కనిపించకపోయినా ఆమెను తెలుగు జనాలు అంత ఈజీగా మర్చిపోరు. తన తొలిచిత్రం 'చిరుత'తోనే గ్లామర్‌ మరియు నటనలో ప్రతిభను ప్రదర్శించిన నేహా, ఆ తర్వాత బాలీవుడ్‌లో అవకాశాలు పొందింది. తెలుగు సినిమాల్లో అనుకున్నంతగా అవకాశాలు రాకపోవడంతో ఆమె బాలీవుడ్‌ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తూ తన కెరీర్‌ కొనసాగించింది. ఇదే తరహాలో ఆమె చెల్లెలు ఐషా శర్మ కూడా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.


ఐషా శర్మ తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించి, 2018లో జాన్ అబ్రహం హీరోగా వచ్చిన 'సత్యమేవ జయతే' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతో ఐషా శర్మ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది, కానీ ఆ తర్వాత ఆమెకు పెద్దగా సినిమాల్లో అవకాశాలు రాలేదు. ఐషా 2022లో 'షైనింగ్ విత్ సర్మాస్' అనే వెబ్ సిరీస్‌లో నటించి, తన ప్రతిభను మరోసారి చూపించింది. ఇకపోతే, ఐషా మూడు మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించి ప్రేక్షకులను అలరించింది.


ఐషా శర్మ సినిమాల్లో అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఐషా శర్మకు 6.8 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు, మరియు ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ప్రతి ఫోటోకు లక్షల్లో లైక్స్ రావడం ఈమెకు సాధారణంగా మారిపోయింది. ఐషా ఫ్యాషన్ స్టైల్, గ్లామర్ ఫోజులతో సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్‌గా మారిపోతుంది.

తాజాగా ఐషా బికినీలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. నెటిజన్లు ఐషా శర్మ 'గ్లామర్ క్వీన్' లా కనిపించిందని కామెంట్స్ చేస్తున్నారు. ఐషా శర్మ తన ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటూ, సోషల్ మీడియాలో నిరంతరం బిజీగా ఉంటోంది. మరి ఈ తరహా గ్లామర్ తో అమ్మడికి ఏమైనా కొత్త అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.