భంగి*మలతో చెమటలు పట్టించిన నెపో కిడ్
సోషల్ మీడియాల్లో చురుగ్గా ఉండేవారికి ఆలయ.ఎఫ్ పరిచయం అవసరం లేదు.
By: Tupaki Desk | 18 Jan 2025 7:30 PM GMTసోషల్ మీడియాల్లో చురుగ్గా ఉండేవారికి ఆలయ.ఎఫ్ పరిచయం అవసరం లేదు. నటి పూజా భేడి నటవారసురాలు ఆలయ ఫర్నిచర్ వాలా బాలీవుడ్‌లో ప్రతిభావంతురాలైన నటి. తాను నటించిన తొలి సినిమాతోనే ఈ భామ అందరి దృష్టిని ఆకర్షించింది. జాన్వీకపూర్, ఖుషి కపూర్, అనన్య పాండే లాంటి భామలకు ఆరంభ చిత్రంతో వచ్చిన టాక్ కంటే, ఆలయ నటించిన మొదటి సినిమాకు మంచి పేరొచ్చింది. ప్రారంభ నటిగా ఆలయ ప్రతిభను క్రిటిక్స్ ప్రశంసించారు.
అయితే తనకు మొదటి చిత్రం విడుదలైన తర్వాత ఆశించినన్ని అవకాశాలు రాలేదని నిర్మొహమాటంగా చెప్పింది ఆలయ. ఫర్నిచర్ వాలా. అయితే ఆలయ నిరంతరం సోషల్ మీడియాల్లో తన అభిమానులను నిరాశపరచదు. ఇటీవల ఈ భామ పోటీ ప్రపంచంలో ఇతర నెపో కిడ్స్ కి ధీటుగా పోటీపడుతూ వరుస ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. తాజాగా మరో కొత్త ఫోటోషూట్ ని ఆలయ షేర్ చేసింది. బికినీలో ఈ బ్యూటీ అందచందాలు మతులు చెడగొడుతున్నాయి. ఆలయ రకరకాల భంగిమల్లో స్టన్నర్‌గా మతులు చెడగొడుతోంది. ప్రస్తుతం అభిమానులు ఈ ఫోటోషూట్ ని వైరల్ గా షేర్ చేస్తున్నారు.
బాలీవుడ్ లో బంధుప్రీతి గురించి చాలా చర్చ సాగుతోంది. కానీ ఇతర నెపో కిడ్స్ లాగా, ఆలయ ఎందుకు ప్రజాదరణ పొందలేదో నాకు అర్థం కాలేదు అని ఒక అభిమాని రెడ్డిట్ లో వ్యాఖ్యానించాడు. ఆమె(ఆలయ) నిజానికి వారి కంటే చాలా బాగుంది. ఆమె బాగా నటించగలదు. నేను ఆలయ నటించిన మొదటి సినిమా చూశాను. ఆమె తన మొదటి సినిమాలోనే చాలా మంచి నటనను కనబరిచింది. అనన్య, సారా, జాన్వి కంటే ఆలయ ఎక్కువ అర్హురాలు అని నేను అనుకుంటున్నాను.. అని అన్నారు.
ప్రముఖ నటి పూజా బేడి, వ్యాపారవేత్త ఫర్హాన్ ఫర్నిచర్‌వాలా కుమార్తె అయిన అలయ 2020లో సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి `జవానీ జానేమాన్`తో బాలీవుడ్‌లో నటిగా రంగ ప్రవేశం చేసింది. తరువాత ఫ్రెడ్డీ, DJ మొహబ్బత్, ఆల్మోస్ట్ ప్యార్, బడే మియాన్ చోటే మియాన్, శ్రీకాంత్ వంటి చిత్రాలలో నటించింది. తదుపరి కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ లో రూపొందనున్న డ్రామా సిరీస్‌లోను నటించనుంది. ఈ సిరీస్‌లో షనాయ కపూర్‌తో కలిసి అలయ నటిస్తుంది. రీతూ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది.