Begin typing your search above and press return to search.

ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్స‌ర్.. ప‌టానీ కిల్లింగ్

గుండెకు ఎలా గాయం చేయాలో దిశా పటానీ బాగా తెలుసు.. తాజా ఇన్‌స్టా పోస్ట్ దీనికి రుజువు.

By:  Tupaki Desk   |   10 Dec 2024 3:47 AM GMT
ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్స‌ర్.. ప‌టానీ కిల్లింగ్
X

గుండెకు ఎలా గాయం చేయాలో దిశా పటానీ బాగా తెలుసు.. తాజా ఇన్‌స్టా పోస్ట్ దీనికి రుజువు. దిశా ఇటీవల దుబాయ్‌లో జరిగిన `ద‌బాంగ్ ది టూర్ - రీలోడెడ్` ఈవెంట్‌లో ప్రదర్శన ఇచ్చింది. ఈ ప్ర‌ద‌ర్శ‌న నుంచి అద్భుతమైన ఫోటోలను షేర్ చేస్తోంది. ఫోటో డంప్ నుంచి ఈ ప్ర‌త్యేక ఫోటో అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది.


టూర్ లో దిశా ఏ రేంజులో దుమ్ము దులిపేసిందో ఈ ఒక్క ఫోటో లీకిచ్చింది. టూ పీస్ లో స్ట‌న్నింగ్ దిశా ప‌టానీ అంద‌చందాలు మతులు చెడ‌గొట్టాయి. డిజైన‌ర్ గౌన్ నూడిల్ పట్టీలు.. సీక్విన్డ్ బ్రాలెట్ .. ప్లంజింగ్ నెక్‌లైన్ ఓవ‌రాల్ గా దిశా సెల‌క్ష‌నే మ్యాడ్ నెస్ పెంచుతుంది. దీనికి కాంబినేష‌న్ గా బ్యాక్‌లెస్ టాప్ రిఫ్లెక్టివ్ మిర్రర్స్‌తో అలంకరించిన మ్యాచింగ్ స్కర్ట్‌తో స్ట‌న్న‌ర్ గా మార్చింది.


దిశా స్పెష‌ల్ లుక్ 80ల‌లో డిస్కో క్వీన్ ని త‌ల‌పించింది. ఆ చిందరవందర జుత్తు.. భుజాలపై అలలుగా ఎగసిపడుతుంటే ఆ మ‌త్తు క‌ళ్లు దిశా బోల్డ్ నెస్ ని మ‌రింత పెంచాయి. ఎంపిక చేసుకున్న బోల్డ్ డ్రెస్ కి త‌గ్గ‌ట్టుగానే, హోప్ చెవిపోగులు.. మెటాలిక్ హై బూట్ ల‌ను ధ‌రించింది. ఇన్‌స్టాలో దిశా షేర్ చేసే ప్ర‌తి లుక్ కార‌ణంగా హెడ్ ట‌ర్న‌ర్ గా మారుతోంది. ఇప్పుడు అంత‌కుమించి కొత్త లుక్ తో ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఎయిటీస్ లో పాపుల‌రైన‌ `ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్స‌ర్..` సాంగ్ ని యూత్ ఇప్పుడు మ‌రోసారి గుర్తు చేసుకుంటోంది.


కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఇటీవ‌ల వ‌రుస‌గా పాన్ ఇండియా చిత్రాల్లో న‌టిస్తోంది. ప్ర‌భాస్ స‌ర‌స‌న క‌ల్కి 2898 ఏడి చిత్రంలో న‌టించింది. అలాగే సూర్య కంగువ‌లోను కీల‌క పాత్ర‌లో న‌టించింది. క‌ల్కి పాన్ ఇండియాలో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిల‌వ‌గా, కంగువ ఫ్లాపైన సంగ‌తి తెలిసిందే. దిశా సెట్లో ఉన్న‌ త‌దుప‌రి చిత్రాలపైనా దృష్టి సారించింది.