అభినవ నాట్య మయూరం జాక్విలిన్
శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ పేరు ఇటీవల రకరకాల కారణాలతో మీడియా హెడ్ లైన్స్ లో నిలిచింది.
By: Tupaki Desk | 27 Jan 2025 3:36 AM GMTశ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ పేరు ఇటీవల రకరకాల కారణాలతో మీడియా హెడ్ లైన్స్ లో నిలిచింది. జైలులో ఉన్న కాన్‌మేన్ సుకేష్ చంద్రశేఖర్ నిరంతరం ప్రేమలేఖలు రాస్తూ జాక్విలిన్ పై ప్రేమను కురిపించడంతో అది మీడియాలో హాట్ టాపిగ్గా మారింది. దీనిపై జాక్విలిన్ చాలా సీరియస్ గా ఉంది. ఇదిలా ఉండగానే తనపై వచ్చిన ఆరోపణలన్నిటినీ పక్కన పెట్టి నటనా కెరీర్ ని చక్కదిద్దుకునేందుకు జాకీ చేయని ప్రయత్నం లేదు.
ఈ భామ సోషల్ వర్క్‌తోను అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది. మూగజీవాల సంరక్షణ గురించి, జంతువుల సంరక్షణ గురించి పెటా - బ్లూక్రాస్ తరపున ప్రచారం చేస్తోంది. మరోవైపు జాక్విలిన్ ఫెర్నాండెజ్ క్రీడల్ని కూడా తనవంతుగా ప్రచారం చేస్తోంది. ముంబైలో ఈ గణతంత్ర దినోత్సవ వేళ జరిగిన ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) కార్యక్రమానికి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హాజరయ్యారు. ఈ భామ ISPL సీజన్ 2 ప్రారంభోత్సవంలో తనదైన ప్రదర్శనతో అలరించింది. జాక్వెలిన్‌తో పాటు, సోను నిగమ్, బి ప్రాక్ వంటి ఇతర తారలు కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చారు.
జాక్విలిన్ ఈ ప్రత్యేక కార్యక్రమంలో అద్భుతమైన నృత్యంతో అలరించిన ఫోటోలు ఇప్పుడు వెబ్ లో వైరల్ అవుతున్నాయి. జాక్విలిన్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ని ప్రాక్టీస్ చేస్తున్నప్పటి ఫోటో సెషన్ నుంచి కొన్ని ఫోటోల్లో అద్బుతమైన నాట్య భంగిమలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. జాక్విలిన్ వేషధారణ, ట్రెడిషనల్ లుక్ అభిమానుల్ని ఎంతో ఆకట్టుకుంటున్నాయి. జాక్విలిన్ ధరించిన స్పెషల్ డ్రెస్ క్రిస్టల్స్ ఎంబ్రాయిడరీతో అత్యంత భారీతనంతో డిజైన్ చేయడంతో ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ లుక్ లో జాకీ అభినవ నాట్యమయూరన్ని తలపిస్తోందని అభిమానులు కితాబిస్తున్నారు.
జాక్విలిన్ కెరీర్ మ్యాటర్ కి వస్తే వెల్ కం టు ది జంగిల్, హౌస్ ఫుల్ 5 చిత్రాల్లో నటిస్తోంది. అయితే వీటిలో వెల్ కం టు ది జంగిల్ చిత్రీకరణ అంతకంతకు ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే.