ఉల్లిపొర డిజైన్ లో జాన్వీ జివ్వుమనిపించేలా!
బాలీవుడ్ నవ నాయిక జాన్వీ కపూర్ అందాలు నెట్టింట ఏ రేంజ్ లో సంచలనమవుతాయో చెప్పాల్సిన పని లేదు.
By: Tupaki Desk | 18 Nov 2024 3:30 PM GMTబాలీవుడ్ నవ నాయిక జాన్వీ కపూర్ అందాలు నెట్టింట ఏ రేంజ్ లో సంచలనమవుతాయో చెప్పాల్సిన పని లేదు. అందులోనూ మిరుమిట్లు గొలిపే చీరందంలో కి దూరిపోయిందంటే? జాన్వీ అందానికి ఎన్ని హృదయాలు గాయ పడునో! అంచనా వేయడం కష్టమే సుమీ. మరోసారి నెట్టింట అలాంటి కోతకే దిగింది జాన్వీ. ఇదిగో ఇక్కడిలో పలుచని ఉల్లి పొర చీరలో పరువాలన్నింటిని ఆవిష్కరించింది.
పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో జివ్వుమనిపిస్తుంది. మ్యాచింగ్ డిజైనర్ బ్లౌజ్ లో మరింత ఆకర్షణీయంగా కని పిస్తుంది. రూప లావణ్యాన్ని హైలైట్ చేస్తూ ఎంపిక చేసుకున్న యాక్సరసీస్ ప్రతీది జాన్వీని మరింత అందంగా తీర్చి దిద్దాయి. చీరందంలో నాభి అందాల ఎలివేషన్ పైనా అంతే ఫోకస్ చేసింది. డిజైన్డ్ డ్రెస్ ల్లో అందాలు ఎలా ఆవి ష్కరించినా ..చీరలో ఆవిష్కరణ మాత్రం ఎంతో ప్రత్యేకమని మరోసారి జాన్వీ రుజువు చేస్తుంది.
ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. అంతకు మంచి కుర్రాళ్ల గుండెల్లో మంటలు పుట్టిస్తుంది. ఇలా చీరలో అందాలు దారబోయడం జాన్వీకి కొత్తేం కాదు. ఇప్పటికే చాలాసార్లు డిజైన్డ్ సారీస్ లో సెగలు రేపింది. వాటికి నెట్టింట మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే హీరోయిన్లు అంతా చీరలో ఎలివేషన్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంటారు. జాన్వీ తాజా పిక్ పై అభిమానులు తమదైన శైలి లో పోస్టు లు పెడుతున్నారు.
ఇక అమ్మడి కెరీర్ సంగతి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్..టాలీవుడ్ ని పరుగులు పెట్టిస్తుంది. ఇటీవలే `దేవర` తో తొలి పాన్ ఇండియా సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ కి జోడీగా మరో సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి `ఉప్పెన` ఫేం బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే.