హబ్బీ తో చందమామ ఘాటు ప్రేమయో!
పెళ్లైన తర్వాతా కెరీర్ పరంగా కాజల్ అగర్వాల్ దూకుడు ఏమాత్రం తగ్గలేదు.
By: Tupaki Desk | 1 Nov 2024 5:38 AM GMTపెళ్లైన తర్వాతా కెరీర్ పరంగా కాజల్ అగర్వాల్ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. వచ్చిన ఏ అవకాశం వదలకుండా ముందుకు వెళ్తోంది. సోలో నాయికగానూ సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది. వివాహం, పిల్లలు పుట్టిన తర్వాత కెరీర్ ని ముందుకు తీసుకెళ్లడం అంత ఈజీ కాదు. కానీ కాజల్ మాత్రం ఇప్పటికీ అదే బ్యూటీని మెయింటెన్ చేస్తూ కొత్త అవకాశాలు అందుకుంటుంది. దర్శక, నిర్మాతలకు టచ్ లో ఉంటూ అవకాశాలు అందుకుంటుంది.
కాపురం ముంబైలో ఉన్నా? కోలీవుడ్..టాలీవుడ్ ని నిరంతరం అంటిపెట్టుకూనే ఉంది. ఈ నేపథ్యంలో అవకాశాలు అందుకోగల్గుతుంది. అలాగే అమ్మడు ఫ్యామిలీ లైఫ్ ని ఏమాత్రం మిస్ అవ్వడం లేదు. షూటింగ్ ఉంటే? మామ్ తో కలిసి నెలలు పాటు హైదరాబాద్, చెన్నైలో ఉండటం? అనంతరం తిరిగి ముంబైకి వెళ్లడం జరుగుతుంది. ఇక హబ్బీ గౌతమ్ కిచ్లూని ఏమాత్రం మిస్ అవ్వదు. తానెంత బిజీగా ఉన్నా? హాలీడేస్ వస్తే మాత్రం వెకేషన్ కి చెక్కేస్తారు.
వారం పది రోజుల పాటు, విహార యాత్రలో మునిగిపోతారు. తాజాగా గౌతమ్ కిచ్లూ-కాజల్ కొత్త ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. అందులో కాజల్ భర్త ప్రేమలో మునిగిపోయింది. భర్త కౌగిలో మునిగి కాజల్ ని గౌతమ్ ప్రేమతో ముద్దాడుతున్నాడు. కాజల్ క్యూట్ గా భర్త ప్రేమకు దాసోహం అవుతుంది. గౌతమ్ స్మార్ట్ లుక్ లో బాగున్నాడు. కాజల్ సైతం అంతే అందంగా ముస్తాబైంది. డిజైనర్ దుస్తుల్లో ఆకర్షిస్తుంది. ఇద్దరు పెళ్లి చేసుకుని నాలుగేళ్లు అవుతుంది.
ఈ సందర్బంగానే ఇలా కొత్త ఫోటోని అభిమానుల కోసం వదిలారు. నాలుగేళ్ల వివాహ బంధాన్ని గౌతమ్ గుర్తు చేసుకుని సర్ ప్రైజ్ అవుతున్నాడు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు ఈ అందమైన జోడీకి విషెస్ తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కాజల్ `కన్నప్ప`, `సికందర్` చిత్రాల్లో నటిస్తోంది.