మ్యాకప్, గ్లిజరిన్ తో విసుగెత్తి ఇంటికెళ్లిపోదామనుకున్నా!
బాలీవుడ్ నటి కాజోల్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 50 ఏళ్ల వయసులోనే అదే బ్యూటీతో ప్రేక్షకుల్ని అలరి స్తుంది.
By: Tupaki Desk | 21 Oct 2024 8:30 PM GMTబాలీవుడ్ నటి కాజోల్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 50 ఏళ్ల వయసులోనే అదే బ్యూటీతో ప్రేక్షకుల్ని అలరి స్తుంది. పాత్ర ఎలాంటిదైనా అందులో కాజోల్ బ్యూటీ మాత్రం హైలైట్ అవుతుంది. ఓవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే నటిగానూ కొనసాగుతుంది. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రల్లో మెప్పిస్తుంది. అసవరం మేర శివంగిలా కూడా మారిపోతుంది. ఇప్పటికే నటిగా తాను సాధించాలనుకున్నవి అన్నీ సాధించింది.
అలాంటి కాజోల్ ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలనుకుంది? అన్న విషయం తెలుసా? అవును ఈ విషయాన్ని ఆమె స్వయంగా రివీల్ చేసింది. `ఉదార్ కీ జిందగీ నా మూడవ సినిమా. అప్పుడు నాకు 18 ఏళ్లు ఉంటాయి. అప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన నాకు అంతా కొత్తగా అనిపించేది. మేకప్, గ్లిజరిన్ వేసుకుని ఎడవడం నాకు నచ్చలేదు. సెట్ లో వాతావరణం..కొన్ని రకాల పరిస్థితులు చూసి ఇమడ లేకపోయాను. అక్కడ ఉండాలనిపించక విసుగు పుట్టింది.
ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసిన తర్వాత ఇంటికెళ్లిపోదామని నిర్ణయించుకున్నా. నటించడం నా వల్ల కాదని ఇంట్లో మా అమ్మకు కూడా చెప్పేసాను. అదే సమయంలో షారుక్ ఖాన్ నన్ను వృత్తిలో కొనసాగేలా ప్రోత్సహించారు. నీకన్నీ తెలుసు. ఇంకా నటించడం నేర్చుకుంటే భవిష్యత్ లో మంచి స్థాయికి వెళ్తావ్? అన్నారు. ఆయన మాటలతో నేను కొంత ధైర్యాన్ని తెచ్చుకున్నాను. ఆ తర్వాత నటనలో టెక్నిక్ లు పట్టుకోవడం మొదలు పెట్టాను` అంది.
ప్రస్తుతం కాజోల్ `దోపత్తి` లో నటించింది. ఈ సినిమా 25న రిలీజ్ అవుతుంది. రిలీజ్ కి ఇంకా నాలుగు రోజులే సమయం ఉండటంతో టీమ్ అంతా ప్రచారంలో బిజీగా ఉంది. అలాగే కాజోల్ చేతిలో కొన్ని కొత్త ప్రాజెక్ట్ లు ఉన్నాయి. స్టార్ హీరోల చి త్రాల్లో కొన్ని కీలక పాత్రలకు సైన్ చేసినట్లు సమాచారం.