కవర్ పేజీపై బెబో హా*ట్ షో!
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్ గ్లామర్ ఛామ్ గురించి చెప్పేదేముంది.
By: Tupaki Desk | 11 Sep 2024 5:57 AM GMTబాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్ గ్లామర్ ఛామ్ గురించి చెప్పేదేముంది. 43 ఏళ్ల వయసులోనూ కరీనా కవ్వింపు పీక్స్ లోనే ఉంటుంది. టోన్డ్ బాడీ లుక్ లో ఎప్పటికప్పుడు సమ్ థింగ్ స్పెషల్ గా ఫోకస్ అవుతుంది. నవతరం నాయికలకు పోటీగా నిలుస్తుంది. జిమ్-యో గా వంటి ఫిట్ నెస్ చర్యలతో ఆఛామ్ ని కంటున్యూ చేయగల్గుతుంది. 40 ప్లస్ లోనూ ధగధగలాడిపోతుంది. నవ నాయికలకు సైతం నా ముందు తగ్గాల్సిందే అంటుంది.
తాజాగా అమ్మడు బజార్ ఇండియాపై మెరిసిన వైనం ఎంతో ఆకర్షణీయం. పసుపు వర్ణం ప్లోరల్ డిజైన్ లో అమ్మడు సంథింగ్ స్పెషల్ గా ట్రై చేసింది. చీరను పోలిన డిజైన్ లో రెగ్యులర్ ఫోజులకు భిన్నంగా హైలైట్ అవుతుంది. నేలను తాకిన చీర షోల్డర్ కొలతలో ముగింపు లేకుండా కరీనా హైట్ ని మించి గాల్లోకి ఎగిరిన సారీ ఇది. ఇందులో అమ్మడి సింగిల్ థై షో హైలైట్. థై అందాన్ని ఫోకస్ చేయడమే పనిగా ఈ డిజైన్ హైలైట్ అవుతుంది.
ఎలాంటి బ్లౌజ్ లేకుండా టాప్ టూ బాటమ్ చీరతోనే అమ్మడిని అలంకరించారు. ఇక చెవులకు ధరించిన గవ్వల జోడీ అంతే ఇంట్రెస్టింగ్. ఆమెలో బ్యూటీని మరింత రెట్టింపు చేసింది. మ్యాకప్..ఇతర యాక్సరసీస్ ప్రతీది కత్రినా మరింత అందంగా ఫోకస్ చేస్తున్నాయి. అనైతా ష్రాప్ కత్రినాని ఇలా స్టైలిష్ గా తీర్చి దిద్దారు. ప్రస్తుతం ఈఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
కరీనా కెరీర్ సంగతి చూస్తే! బాలీవుడ్ కి ఎంత మంది భామలు దిగొచ్చినా అమ్మడికి పోటీ అనేదే లేదు. ఇటీవలే `ది క్రూ`తో మరో భారీ విజయం ఖాతాలో వేసుకుంది. సినిమా మంచి లాభాలు తేవడంతో అదే కాంబినేషన్ మరో సినిమాకి సన్నాహాలు చేస్తోంది. అలాగే `సింగం ఎగైన్` లోనూ కరీనా కీలక పాత్ర పోషిస్తుంది. కాఫ్ స్టోరీలో కరీనా మార్క్ పడుతుందని అంచనాలున్నాయి.