పిక్‌టాక్ : అందమైన లొకేషన్‌లో కత్రీనా చిల్లింగ్
సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 20 ఏళ్లు దాటిన అదే అందం, అదే ఛార్మింగ్‌తో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కత్రీనా కైఫ్. సాధారణంగా ముద్దుగుమ్మల వయసు మీద పడుతుంటే అందం తగ్గిపోతూ మారి పోతూ ఉంటారు.
By: Tupaki Desk | 27 Feb 2025 10:06 AM GMTసినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 20 ఏళ్లు దాటిన అదే అందం, అదే ఛార్మింగ్‌తో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కత్రీనా కైఫ్. సాధారణంగా ముద్దుగుమ్మల వయసు మీద పడుతుంటే అందం తగ్గిపోతూ మారి పోతూ ఉంటారు. కానీ కత్రీనా కైఫ్ మాత్రం రోజు రోజుకు మరింత అందంగా కనిపిస్తూ ఉంటుంది అంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తూ ఉంటారు. నిజంగానే కత్రీనా ఏళ్లు గడుస్తున్న కొద్ది మరింత అందంగా కనిపిస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ అందాల కత్రీనా అందమైన లొకేషన్‌లో చిల్ అవుతోంది. తాజాగా తన చిల్లింగ్ మూమెంట్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.
కొన్ని రోజుల ముందు ప్రయాగ్ రాజ్‌లో జరిగిన మహాకుంభ మేళాలో కత్రీనా కైఫ్ పాల్గొన్న విషయం తెల్సిందే. ఆ సమయంలో ఆమె మహా పుణ్య స్నానంకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందమైన కత్రీనా కైఫ్ కుంభమేళలోనూ చాలా అందంగా కనిపించింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అని ఎప్పటికప్పుడు అభిమానులు, సోషల్ మీడియా ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈమధ్య కాలంలో గతంతో పోల్చితే సినిమాల సంఖ్య కాస్త తగ్గించింది. అయినా కూడా ఈ అమ్మడి ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు.
ఇన్‌స్టా గ్రామ్‌లో 8 కోట్లకు పైగా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న కత్రీనా కైఫ్ ఒక్క పోస్ట్ అందమైన ఫోటో షూట్ పోస్ట్ పెడితే లక్షల్లో లైక్స్ వస్తు ఉంటాయి. తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో అందమైన లొకేషన్‌ను ఎంజాయ్ చేస్తూ కత్రీనా కైఫ్ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చాలా అందంగా కత్రీనా కైఫ్ ఉందని, అంతే కాకుండా అందమైన లొకేషన్‌ను సైతం డామినేట్ చేసే విధంగా ఆమె అందం ఉందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొన్నటి వరకు కుంభమేళాలో కనిపించి తన భక్తిని చాటుకున్న కత్రీనా ఇప్పుడు పూర్తి విశ్రాంతి మూడ్‌లో కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
గత ఏడాది విజయ్ సేతుపతితో కలిసి నటించిన మేరి క్రిస్మస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకోవడం మాత్రమే కాకుండా నటనతోనూ మెప్పించింది. కొత్తగా ఒకటి రెండు ప్రాజెక్ట్‌లు నడుస్తున్నా వాటి గురించి అధికారికంగా మాత్రం ప్రకటన చేయడం లేదు. కొన్ని సంవత్సరాల ముందు ఏడాదిని మూడు నాలుగు సినిమాల్లో నటించిన కత్రీనా కైఫ్ ఇప్పుడు మాత్రం ఆ సంఖ్య చాలా తగ్గించింది. ఆఫర్లు వచ్చినా అంతగా పట్టించుకోకుండా ఆచితూచి వ్యవహరిస్తుంది. తాజాగా ఈమె భర్త విక్కీ కౌశల్ నటించిన 'ఛావా' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హిందీలో ఇప్పటి వరకు దాదాపు రూ.400 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. మార్చి 7న తెలుగులోనూ ఛావా సినిమా రానుంది. దాంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.