ఆరడుగుల బుల్లెట్టు ఈ నటవారసురాలు!
ఖుషి కపూర్ నటించిన మొదటి చిత్రం `లవ్‌యపా` విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 19 Jan 2025 3:00 AM GMTఖుషి కపూర్ నటించిన మొదటి చిత్రం `లవ్‌యపా` విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. జునైద్ ఖాన్ - ఖుషీ ఈ చిత్రంలో జంటగా నటించగా, ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ఆకట్టుకున్నాయి. ట్రైలర్ లో ఖుషి నటన హైలైట్ అయింది. సినిమాలోని ఒక పాట కోసం ఖుషి ప్రత్యేకంగా క్లాసికల్ డ్యాన్స్‌లో శిక్షణ పొందింది. ఒక కళాకారిణిగా అంకితభావం, బహుముఖ ప్రజ్ఞ అందరికీ నచ్చుతోంది. ప్రస్తుతం ఈ అందమైన ప్రేమకథా చిత్రాన్ని తెరపై చూడాలని అంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
నేటితరం ప్రేమ కథతో రూపొందించిన `లవ్‌యాపా`లో నటీనటుల మరపురాని ప్రదర్శనలు, ఉత్సాహభరితమైన సంగీతం, అద్భుతమైన విజువల్స్ కట్టి పడేస్తాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలో లవ్ ఎలిమెంట్ రకరకాల కోణాలను అందంగా అన్వేషిస్తుంది. తరతరాలుగా ప్రేక్షకుల హృదయాలను తాకే కథతో రూపొందిందని ప్రచార వేదికపై జునైద్ చెప్పారు.
లవ్ యాపా ప్రచార వేదికల వద్ద ఫోటోషూట్లతో ఖుషి కపూర్ చాలా హంగామా సృష్టిస్తోంది. తాజాగా ఖుషి మిర్రర్ సెల్ఫీ అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. అసలే ఆరడుగుల బుల్లెట్టులా ఒడ్డు పొడుగు ఉండే ఖుషి, ఇలా సెల్ఫీ దిగుతూ కుర్రకారు గుండెల్ని టచ్ చేస్తోంది. పింక్ ఫోను.. వైట్ షర్ట్.. డెనిమ్ బ్లూ ఫ్యాంట్.. కాంబినేషన్ అదిరిపోయిందంటూ అభిమానులు ఈ ఫోటోగ్రాఫ్ ని వైరల్ గా షేర్ చేస్తున్నారు. లవ్ యాపా సక్సెసైతే ఖుషి కపూర్ కెరీర్ కి అది పెద్ద బూస్ట్ కానుంది.