చీరలో బ్యాక్ లెస్ అందం.. హీటెక్కించేసిన మేఘా
నార్త్ ఇండియన్ బ్యూటీస్ గ్లామర్ షో విషయంలో ఎప్పటికప్పుడు షాక్ ఇస్తూనే ఉంటారు.
By: Tupaki Desk | 5 Sep 2024 4:09 AM GMTనార్త్ ఇండియన్ బ్యూటీస్ గ్లామర్ షో విషయంలో ఎప్పటికప్పుడు షాక్ ఇస్తూనే ఉంటారు. సిల్వర్ స్క్రీన్ పై తమని తాము గ్రాండ్ గా షోకేస్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. గ్లామరస్ ఫోటోషూట్ లతో నెటిజన్లను ఆకర్షిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్తగా తమని తమకు రిప్రజెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా హీరోయిన్స్ గా ఎదగాలని అనుకునే బ్యూటీస్ అందరికి ఇన్ స్టాగ్రామ్ మంచి ప్లాట్ ఫామ్ గా దొరికింది.
అదిరిపోయే పోర్ట్ పోలియోతో గ్లామర్ బ్యూటిస్ ఎప్పటికప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో తమని తాము షోకేస్ చేసుకుంటారు. అయితే గ్లామర్ షో విషయంలో స్టార్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తున్న కొంతమంది భామలకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావు. వారికి ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలా గ్లామర్ షోతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన బ్యూటీ మేఘా శుక్లా.
ఈ అమ్మడు హిందీలో కథల్: ది జాక్ ఫ్రూట్ మిస్టరీ మూవీలో ఓ పాత్రలో నటించింది. మోడలింగ్ లో ఈ బ్యూటీ రాణిస్తోంది. అయితే సినిమాలలో పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇన్ స్టాగ్రామ్ లో మేఘా శుక్లా చాలా యాక్టింగ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోషూట్ లు, వీడియోలని షేర్ చేస్తూ ఉంటుంది. ఫ్యాన్స్ కి కావాల్సినంత వినోదం అందిస్తూ ఉంటుంది. మేఘా శుక్లా గ్లామర్ పిక్స్ ని చూడటానికి చాలా మంది నెటిజన్లు ఆమెని ఫాలో అవుతారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు బోల్డ్ అండ్ గ్లామర్ ఫొటోస్, వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలలో పైన జాకెట్ లేకుండా కేవలం చీరకట్టుతో బ్యాక్ లెస్ అందాలతో కట్టిపడేస్తోంది. ఈ ఫోటోలలో మేఘా శుక్లా పర్ఫెక్ట్ గ్లామర్ తో ఉందనే మాట నెటిజన్లు నుంచి వినిపిస్తోంది. మేఘా శుక్లా ఫోటోలపై నెటిజన్లు బోల్డ్ కామెంట్స్ తో ప్రశంసలు కురిపిస్తున్నారు.