నేహా శర్మ మతి చెడే అందాలు
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సరసన `చిరుత` చిత్రంలో నటించిన నేహాశర్మ కొద్ది రోజులుగా విదేశీ ఫుట్ బాల్ ఆటగాడు పీటర్ తో బహిరంగంగా షికార్లు చేయడం చర్చనీయాంశమైంది.
By: Tupaki Desk | 1 March 2025 3:18 AM GMTమెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సరసన `చిరుత` చిత్రంలో నటించిన నేహాశర్మ కొద్ది రోజులుగా విదేశీ ఫుట్ బాల్ ఆటగాడు పీటర్ తో బహిరంగంగా షికార్లు చేయడం చర్చనీయాంశమైంది. ఈ భామ అతడితో ఎంతో చనువుగా కనిపించిన ఫోటోలు ఇంతకుముందు వైరల్ అయ్యాయి. పీటర్ స్లిస్కోవిక్ 33 ఏళ్ల క్రొయేషియన్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడితో నేహా శర్మ నిండా ప్రేమలో మునిగిందని కథనాలొచ్చాయి.
ఇదిలా ఉండగానే ఈ బ్యూటీ వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తూ, ఫీలర్లు వదులుతూనే ఉంది. తాజాగా ఓ త్రోబ్యాక్ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసి, ఫ్యాన్స్ కి మతులు చెడగొట్టింది. బ్లాక్ టాప్, బ్లాక్ మినీ బాటమ్ తో నేహా శర్మ ఎంతో అందంగా, రొమాంటిగ్గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ని ఫ్యాన్స్ వైరల్ గా షేర్ చేస్తున్నారు.
నేహా శర్మ 2007లో `చిరుత` చిత్రంతో కథానాయికగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో మాత్రమే నటించింది. నేహా నటించిన చివరి హిట్ సినిమా `తాన్హాజీ`. `ఇల్లీగల్` అనే వెబ్ సిరీస్‌లో న్యాయవాది నిహారిక సింగ్ పాత్రలో ఆకట్టుకుంది. తదుపరి ఓ ప్రముఖ హీరో సరసన ఈ బ్యూటీ నటించనుందని సమాచారం. అయితే తెలుగు, తమిళంలో నటించేందుకు శర్మా గాళ్ అంతగా ఆసక్తిని కనబరచకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.