Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : అందాల పీసీ మళ్లీ వచ్చింది!

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా చాలా రోజుల తర్వాత ఇండియన్ మూవీలో నటిస్తుంది. అదీ మన టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా కావడం విశేషం.

By:  Tupaki Desk   |   27 March 2025 10:30 AM
పిక్‌టాక్ : అందాల పీసీ మళ్లీ వచ్చింది!
X

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా చాలా రోజుల తర్వాత ఇండియన్ మూవీలో నటిస్తుంది. అదీ మన టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా కావడం విశేషం. గత నెలలో హైదరాబాద్‌ షెడ్యూల్‌లో ప్రియాంక చోప్రా పాల్గొన్న విషయం తెల్సిందే. SSMB29 సినిమా షూటింగ్‌లో పాల్గొనడం కోసం అమెరికా నుంచి ఆ సమయంలో వచ్చిన ప్రియాంక చోప్రా హైదరాబాద్‌లో కొన్ని రోజుల పాటు ఉండి షూటింగ్‌ పూర్తి చేసుకుని ముంబై వెళ్లి పోయింది. అక్కడ తన సోదరుడి వివాహ వేడుకల్లో పాల్గొంది. దాదాపు వారం నుంచి పది రోజుల పాటు ఆ వివాహ వేడుకల్లో ప్రియాంక చోప్రా తన భర్తతో కలిసి పాల్గొంది.


పెళ్లి వేడుకల తర్వాత అమెరికా వెళ్లి పోయిన ప్రియాంక చోప్రా తిరిగి ఇండియాకు వచ్చింది. హైదరాబాద్‌కి వచ్చినట్లు ఈమె స్వయంగా చెప్పుకొచ్చింది. ఈమె ఇండియాకు వచ్చింది అంటే కచ్చితంగా SSMB29 సినిమా కొత్త షెడ్యూల్‌ కోసం అయ్యి ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కాంబో సీన్స్‌ను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి షెడ్యూల్‌ను అల్యూమీనియం ఫ్యాక్టరీలో నిర్వహించిన మేకర్స్‌ సెకండ్‌ షెడ్యూల్‌ను ఒడిశాలో నిర్వహించారు. మూడో షెడ్యూల్‌ ఎక్కడ అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా రాజమౌళి ఈ సినిమాను బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌ తో ప్లాన్‌ చేస్తున్నాడు.

ప్రియాంక చోప్రా ఇండియా రావడంకు ముందు ఈ ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అమెరికాలో ఈ ఫోటోను తీసుకుని ఉంటుంది. అందాల ప్రియాంక చోప్రా వయసు పెరుగుతున్నా కొద్ది మరింత అందంగా కనిపిస్తుందని, పాతికేళ్ల పడుచు అమ్మాయి తరహాలో ప్రియాంక చోప్రా ఈ పోటోలో కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్‌ చేస్తున్నారు. సన్నని ఫిజిక్‌తో పాటు, చక్కని రూపం ఈ అమ్మడి సొంతం. అందుకే ఈమెకు బాలీవుడ్‌ నుంచే కాకుండా ఏకంగా హాలీవుడ్‌లోనూ ఈమెకు అభిమానులు ఉన్నారు. హాలీవుడ్‌ సినిమాలు, సిరీస్‌ల్లోనూ ఈమె నటిస్తూ కన్నుల విందు చేస్తుంది. ఫుల్‌ జీన్స్ ధరించి, వైట్ టాప్‌లో హొయలు పోతూ పీసీ సెల్ఫీకి పోజ్ ఇచ్చింది. పీసీ నావెల్‌ రింగ్‌ నెటిజన్స్ చూపు తిప్పనివ్వడం లేదు. మహేష్ బాబు సినిమాలో ఈమెను ఎప్పుడు చూస్తామా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

SSMB29 సినిమాలో మహేష్ బాబుకు ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుందా లేదంటే కీలక పాత్రలో కనిపించబోతుందా అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్‌ ఉంటుంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రియాంక పాత్ర గురించి మరింతగా చర్చ జరుగుతోంది. అసలు విషయం ఏంటి అనేది రాజమౌళి నోరు తెరిస్తే కాని తెలిసే అవకాశం లేదు. త్వరలో రాజమౌళి ఈ సినిమా విషయమై అన్ని విషయాలను వెళ్లడించేందుకు గాను మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రియాంక చోప్రా మరో వైపు హాలీవుడ్‌లో ఒక సినిమాను చేయడంతో పాటు మరో వెబ్‌ సిరీస్‌ను చేస్తున్నట్లు తెలుస్తోంది.