పండగ ముగిసినా రకుల్ ఇంకా అదే మూడ్‌లో?
తన భర్త జాకీ భగ్నానీ సైతం అట్ల తద్ది పూజా కార్యక్రమాల్లో భార్య రకుల్‌తో అన్యోన్యంగా కలిసి మెలిసి కనిపించాడు.
By: Tupaki Desk | 23 Oct 2024 1:30 PM GMTఇటీవలే భర్తతో కలిసి అట్ల తద్ది పండుగను వేడుకగా జరుపుకుంది రకుల్ ప్రీత్ సింగ్. భర్తను పూజించే, గౌరవించే సనాతన భారతీయ సాంప్రదాయంలో రకుల్ ప్రీత్ పద్ధతులు, సంస్కృతి అందరినీ ఆకర్షించింది. ఎరుపురంగు దుస్తులు ధరించి సాంప్రదాయబద్ధంగా, అందంగా పూజా కార్యక్రమాలను నిర్వహించిన రకుల్ అనంతరం తన భర్త, అత్త మామల ఆశీర్వాదం తీసుకుంది. భర్తతో సరదా క్షణాలకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ని రకుల్ సోషల్ మీడియాల్లో షేర్ చేసింది.
తన భర్త జాకీ భగ్నానీ సైతం అట్ల తద్ది పూజా కార్యక్రమాల్లో భార్య రకుల్‌తో అన్యోన్యంగా కలిసి మెలిసి కనిపించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. ఇంతలోనే ఇప్పుడు రకుల్ ప్రీత్ ఇటీవలి స్టన్నింగ్ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోషూట్ లో రకుల్‌ప్రీత్ ఎరుపు రంగు కళాత్మక డిజైనర్ గౌన్ ధరించింది. హాఫ్ షోల్టర్ డిజైనర్ బ్లౌజ్ రకుల్ అందాన్ని పదింతలు పెంచింది. రకుల్ స్ట్రైకింగ్ ఐ కాంటాక్ట్, డ్యాషింగ్ యాటిట్యూడ్‌ని ఈ ఫోటోగ్రాఫ్ ఎలివేట్ చేస్తోంది.
ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్‌లో వైరల్ గా మారుతోంది. రకుల్ ఇంతకుముందు భారతీయుడు 2 లో నటించింది. శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా ఊహించని ఫలితాన్ని ఎదుర్కొంది. తదుపరి `భారతీయుడు 3`లోను రకుల్ ప్రీత్ నటించాల్సి ఉంది. అలాగే అజయ్ దేవగన్ సరసన దేదే ప్యార్ దే 2లోను రకుల్ నటిస్తోంది. భగ్నానీ ఫ్యామిలీ బ్యానర్ నిర్మించే సినిమాలు చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఈ సంస్థ నష్టాలలో ఉందని బాలీవుడ్ మీడియాలో కథనాలొచ్చాయి.