Begin typing your search above and press return to search.

చొక్కా గుండీలు విప్పి ర‌కుల్ ర‌చ్చ‌

నిజ‌మే.. చాలా కాలంగా సౌత్ లో ర‌కుల్ త‌న ఉనికిని కోల్పోయింది. కేవ‌లం ముంబైలో మాత్రమే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

By:  Tupaki Desk   |   10 Jan 2025 4:10 AM GMT
చొక్కా గుండీలు విప్పి ర‌కుల్ ర‌చ్చ‌
X

చొక్కా గుండీలు విప్పి.. థై అందాల‌ను ఆర‌బోసి... టోన్డ్ దేహ‌శిరుల‌ను ఎలివేట్ చేస్తూనే.. మ్యారీడ్ బ్యూటీ ర‌కుల్ ర‌చ్చేమిటీ? ఇదిగో ఈ కొత్త లుక్ చూడ‌గానే నెటిజ‌నుల్లో మొద‌లైన డిబేట్ ఇది. కొత్త సంవ‌త్స‌రంలో కొత్త‌గా క‌నిపించాల‌నే తాప‌త్ర‌య‌మా? కెర‌ర్ ని రీబూట్ చేయాల‌ని ర‌కుల్ 2.0 భావిస్తోందా? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కుర‌స్తోంది. ఆస‌క్తిక‌రంగా మెడ‌లో ఆ డిజైన‌ర్ ఆభ‌ర‌ణాల‌ గురించి అభిమానులు ఎక్కువ ఆసక్తిగా ముచ్చ‌టించుకుంటున్నారు.


నిజ‌మే.. చాలా కాలంగా సౌత్ లో ర‌కుల్ త‌న ఉనికిని కోల్పోయింది. కేవ‌లం ముంబైలో మాత్రమే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. హిందీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్నా కొత్త సినిమాల‌కు సంత‌కాలు చేస్తున్న‌ది త‌క్కువే. అందుకే ర‌కుల్ తాజా ఫోటోషూట్ పై కొంత ఘాటైన వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.


ర‌కుల్ బ్ల‌ష్ పింక్ ష‌ర్ట్ లుక్ అభిమానుల్లో చ‌ర్చ‌గా మారుతోంది. ``చ‌లో యు గైస్ క్యాప్షన్ దిస్ బెస్ట్ క్యాప్షన్ కో మిలేగా రిప్లై`` అని దీనికి ర‌కుల్ అంద‌మైన‌ క్యాప్ష‌న్ ఇచ్చింది. ఈ ఫోటో వేగంగా వైర‌ల్ అవుతోంది. ఇదే గాక ర‌కుల్ సోష‌ల్ మీడియాల్లో వ‌రుస‌గా హా* ఫోటోషూట్లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. వీట‌న్నిటిపైనా యువ‌త‌రం వేగంగా స్పందిస్తున్నారు.


రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవ‌ల భార‌తీయుడు 2 (ఇండియ‌న్ 2)లో క‌నిపించింది. త‌దుప‌రి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన భార‌తీయుడు 3 లోను కనిపిస్తుంది. ముదస్సర్ అజీజ్ `మేరే హస్బెండ్ కి బివి`లో అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ ల‌తో క‌లిసి క‌నిపించ‌నుంది. వాషు భగ్నాని, జాకీ భగ్నాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 21న సినిమా విడుదల కానుంది.