భంగిమలతో మతి చెడగొట్టిన మోడల్ కం నటి
పెద్దగా సినిమాల్లేకపోయినా సోషల్ మీడియాల్లో నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో టచ్ లో ఉంది రుహి సింగ్. టాప్ మోడల్ గా ఆర్జిస్తోంది.
By: Tupaki Desk | 3 Feb 2025 3:00 AM GMTపెద్దగా సినిమాల్లేకపోయినా సోషల్ మీడియాల్లో నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో టచ్ లో ఉంది రుహి సింగ్. టాప్ మోడల్ గా ఆర్జిస్తోంది. సోషల్ మీడియా ఫాలోవర్స్ కారణంగా మరికొంత ఆదాయం ఆదుకుంటోంది. దీనికి తోడు వెబ్ సిరీస్ లలో అవకాశాలొస్తున్నాయి. కింగ్ ఫిషర్ క్యాలెండర్ గాళ్ గా మొదలైన రుహీ సూపర్ మోడల్ గా, నటిగా బహుముఖ పాత్రలతో ఆర్జిస్తూ జీవనం సాగిస్తోంది. ఇలాంటి టాప్ మోడల్స్ కి నటన అనేది బోనస్ లాంటిది.
రూహీ ఇటీవల మంచు కాంపౌండ్ సినిమా మోసగాడులో నటించినప్పుడు టాలీవుడ్ లోను చర్చల్లోకొచ్చింది. ఇకపోతే రుహి తాజా ఫోటోషూట్ ని అభిమానుల కోసం ఇన్ స్టా వేదికగా షేర్ చేయగా వైరల్ గా మారింది. ఈ ఫోటోగ్రాఫ్స్ లో రూహీ థై థండర్ షోస్ ప్రముఖంగా చర్చకు వచ్చాయి. బోల్డ్ బాటమ్ లెస్ లుక్ లో రూహీ టూ హా* గా కనిపించింది. ఈ కొత్త గెటప్ లో టోన్డ్ లెగ్స్ సౌందర్యాన్ని రూహీ ప్రదర్శించింది. ఈ బోల్డ్ అండ్ డస్కీ లుక్ చూడగానే, బ్లాక్ కలర్ డిజైనర్ టాప్ రూహీ అందాన్ని పదింతలు పెంచిందని అంగీకరించాలి. కిల్లింగ్ భంగిమలు .. వేడెక్కించే డ్రెస్సింగ్ సెన్స్ కారణంగా మరోసారి ఫిలింసర్కిల్స్ లో, ఫాలోవర్స్ లో హా* టాపిక్ గా మారింది.
బికినీ బీచ్ సెలబ్రేషన్లు, స్విమ్ సూట్లలో హొయలు పోవడాలు వగైరా రూహీకి కొత్తేమీ కాదు. ఇకపోతే రూహీ ఎంత ప్రయత్నిస్తున్నా సినిమాల్లో పెద్ద అవకాశాలు వరించడం లేదు ప్రస్తుతానికి సోషల్ మీడియాలే జీవనాధారం. మోడలింగ్ అసైన్ మెంట్స్ ఓటీటీలు ఇలాంటి మోడల్ కం నటీమణులను ఆదుకుంటున్నాయి. రూహీ చివరిగా చక్రవ్యూహ్ అనే వెబ్ సిరీస్ లో నటించగా ఇందులో తన నటనకు గుర్తింపు దక్కింది. రూహీ కెరీర్ ఆరంభం మధుర్ భండార్కర్ తెరకెక్కించిన కేలెండర్ గర్ల్స్ లో నటించిన సంగతి తెలిసిందే.