Begin typing your search above and press return to search.

GQ కవర్ స్టోరి.. సామ్ ది రూల‌ర్

స‌మంత రూత్ ప్రభు.. ది స్ట‌న్న‌ర్ .. రెబ‌ల్ లేడీ కా బాప్.. ఆ బాడీ లాంగ్వేజ్ లో బాస్ వైబ్స్ చూశాక యూత్ ఇలాంటి కాంప్లిమెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు.

By:  Tupaki Desk   |   4 Feb 2025 11:18 AM GMT
GQ కవర్ స్టోరి.. సామ్ ది రూల‌ర్
X

స‌మంత రూత్ ప్రభు.. ది స్ట‌న్న‌ర్ .. రెబ‌ల్ లేడీ కా బాప్.. ఆ బాడీ లాంగ్వేజ్ లో బాస్ వైబ్స్ చూశాక యూత్ ఇలాంటి కాంప్లిమెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ స‌రిహ‌ద్దులే లేవ్ ఇప్పుడు. అన్ని హ‌ద్దులు చెరిగిపోయాక అందుకు త‌గ్గ‌ట్టే ఇప్పుడు స్టార్లు మారాల్సిన స‌న్నివేశం క‌నిపిస్తోంది. లైమ్ లైట్ లో నిల‌బ‌డాలంటే ప్ర‌తిసారీ ఏదో ఒక యూనిక్ లుక్ తో అభిమానుల ముందుకు రావాలి. దానికోసం సాహ‌సోపేత‌మైన ఫ్యాష‌న్ సెన్స్ ని , స్టైల్ కంటెంట్ ని అడాప్ట్ చేసుకోవాలి. ఇలాంటి విష‌యాల్లో టాలీవుడ్ క్వీన్ స‌మంత ఎప్పుడూ ముందుంటుంది.


బాలీవుడ్ క్వీన్ కంగ‌న‌, అనుష్క శ‌ర్మ, సోన‌మ్ క‌పూర్ వంటి సీనియ‌ర్ ఫ్యాష‌న్ ఐక‌న్స్ స్టైలింగ్ అండ్ సెన్స్ ప‌రంగా అసాధార‌ణ ప్ర‌యోగాలు చేసారు. వీళ్ల బాట‌లోనే స‌మంత టాలీవుడ్ లో త‌న‌కంటూ ఓ యూనిక్ స్టైల్, ఫ్యాష‌న్ సెన్స్ ఉన్నాయ‌ని నిరూపించారు. సౌత్ ఫ్యాష‌నిస్టాగా ఇప్ప‌టికే నిరూపించిన సమంత ఇప్పుడు కొత్త లుక్ తో హృద‌యాల‌ను కొల్ల‌గొడుతోంది. ప్ర‌ఖ్యాత జీక్యూ ఇండియా మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై స‌మంత కొత్త లుక్ ఇప్పుడు యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది. స‌మంత బాస్ లేడీ వైబ్స్ ని మించి రెబ‌లియ‌న్ యాటిట్యూడ్ ని ఈ ఫోటోషూట్ ఎలివేట్ చేసింది.


హాలీవుడ్ క్వీన్స్ మ‌ర్లిన్ మన్రో, ఎలిజ‌బెత్ టేల‌ర్ లోని ప్ర‌యోగాత్మ‌క‌త ఇప్పుడు స‌మంత‌లోకి ప్ర‌వ‌హించింది అంటే అది ఏమంత‌ అతిశ‌యోక్తి కాదు. త‌న కెరీర్ ఎంపిక‌లు, ఛాయిస్‌ల‌కు అనుగుణంగా త‌న రూపురేఖ‌ల్ని కూడా మార్చుకునేందుకు స‌మంత చేస్తున్న ఈ ప్ర‌య‌త్నం క‌చ్ఛితంగా అడ్వాన్స్ డ్ థింకింగ్ అని అంగీక‌రించాలి. సామ్ ఎంపిక చేసుకున్న యూనిక్ హెయిర్ స్టైల్ యూత్ కి స్ఫూర్తిగా మారుతుంది. చాలా మంది నా పాత్రలతో సంబంధం కలిగి ఉంటారు.. ఎందుకంటే వారు నాలో తమలో ఒక భాగాన్ని చూస్తారు`` అంటూ జీక్యూతో ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించింది స‌మంత‌.


సామ్ త‌దుప‌రి రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్న `ర‌క్త్ భ్ర‌హ్మాండ్` వెబ్ సిరీస్ లో ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌తో అభిమానుల‌ను అల‌రించ‌నుంది. స‌మంత తాజా ఇంట‌ర్వ్యూల్లో ఇచ్చిన హింట్ ని బ‌ట్టి `ఫ్యామిలీమ్యాన్ 2`లో పాత్ర‌ను మించి ఇది ప్ర‌యోగాత్మ‌కంగా ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది. పాత్ర‌ల‌తో ప్ర‌యోగాలే కాదు వ్య‌క్తిత్వంతో, ఎంపిక చేసుకునే డిజైన‌ర్ లుక్ తో ప్ర‌యోగాలు చేయ‌గ‌ల యూనివ‌ర్శ‌ల్ స్టార్ స‌మంత అని ఇప్పుడు అంగీక‌రించాలి.